అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన మన్మథుడు సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. నాగ్ కెరీర్ లోనే ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం ఎవర్ గ్రీన్ హిట్. ఈ మూవీలో నాగ్ ప్రేయసిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది అన్షు. ఫస్ట్ మూవీతోనే తెలుగు కుర్రకారు హృదయాలను దోచేసింది. అందం, అభినయంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. కానీ ఆ తర్వాత అన్షు ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన.. ఫ్యామిలీతో కలిసి సెటిల్ అయ్యింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యింది. ప్రస్తుతం ఆమె మజాకా సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేయనుంది.
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించగా.. రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. ఇందులో రావు రమేష్, అన్షు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈనెల 26న విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్షు.. తన సినీప్రయాణం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తాను 15 ఏళ్లకే సినీరంగంలోకి అడుగుపెట్టానని.. అప్పుడే మన్మథుడు, రాఘవేంద్ర సినిమాలు చేసానని.. అప్పటికీ తాను అంతగా పరిణితి లేదని తెలిపింది. నటనను కెరీర్ గానూ భావించలేదని.. చదువులపైనే దృష్టి పెట్టాలనుకున్నానని.. అందుకే లండన్ వెళ్లిపోయానని.. అక్కడే మాస్టర్స్ కంప్లీట్ చేసినట్లు తెలిపింది. సొంతంగా ఓ క్లినిక్ పెట్టుకుని థెరపిస్ట్ గా పనిచేశానని.. తనకు 24 ఏళ్లకే పెళ్లి అయ్యిందని తెలిపింది. ఒకవేళ తనకు 25 ఏళ్లు ఉన్నప్పుడు మన్మథుడు సినిమా చేసి ఉంటే నటనలోనే కొనసాగేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన