ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోరీకి గురైన ఓ మహిళ స్కూటీని పోలీసులు రికవరీ చేశారు. దీంతో ఆ బైక్‌ను చూసి మహిళ భావోద్వేగానికి గురైంది. తాజాగా దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
Andhra Pradesh Cm Chandrababu
ఏలూరికి చెందిన నీల అలివేణికి చెందిన స్కూటీ కొన్ని రోజుల క్రితం చోరీకి గురైంది. దాంతో ఆమె తన స్కూటీ దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్కూటీ లేకపోవటంతో అలివేణి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. తల సేమియా వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెను ఆస్పత్రికి ఆ స్కూటీ మీదే తీసుకువెళ్లేది. అయితే స్కూటీ చోరీకి గురవడంతో తన కుమార్తెను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంది. దాంతో స్కూటీ ఎప్పుడు దొరుకుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూడటం మొదలుపెట్టింది. తాజాగా ఏలూరు పోలీసులు వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకుని వారు దోచుకెళ్లిన బైకులను రికవరీ చేశారు. అందులో అలివేణి స్కూటీ కూడా ఉంది. పోలీసులు అలివేణిని పిలిచి తన స్కూటీ దొరికిందని స్టేషన్‌కు వచ్చి తీసుకు వెళ్ళమని చెప్పడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అలివేణి నేరుగా తను పోగొట్టుకున్న స్కూటీ వద్దకు వెళ్లి దానిని ప్రేమగా హత్తుకుని కంటతడి పెట్టి భావోద్వేగానికి గురైంది. అయితే ఇదే విషయాన్ని ఏపీ పోలీసులు సైతం సోషల్ మీడియా సైట్లో పోస్ట్ చేయడంతో అది తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే పోలీసులను అభినందిస్తూ ట్విట్ చేశారు. ఆ మహిళకు స్కూటీ అందజేసిన పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాక బాధిత మహిళ నీల అలివేణి భావోద్వేగం చెందడం తనను కదిలించిందని, స్కూటర్ ఆమెకు ఎంత ముఖ్యమో చూస్తే వారి పరిస్థితి అర్ధం అవుతుందన్నారు.
Seeing however important that motorcycle was to that mother, is profoundly moving. Smt Nili Aliveni was devastated erstwhile the scooter she utilized to instrumentality her Thalassemia-affected girl to the infirmary was stolen. Her emotions, erstwhile the motorcycle was recovered by the police, amusement however overmuch it means to… https://t.co/asAoKaiks7
— N Chandrababu Naidu (@ncbn) November 8, 2024