Telugu Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం మొత్తం తొమ్మిది గ్రహాల్లో రాహువును అత్యంత పాప గ్రహంగా పరిగణిస్తారు. ప్రస్తుతం రాహువు మీన రాశిలో సంచరిస్తోంది. సాధారణంగా రాహువు స్వతంత్రంగా ఫలితాలనివ్వడం జరగదు. తాను ఉన్న రాశి నాథుడి ఫలితాలను గానీ, తనతో కలిసి ఉన్న గ్రహం ఫలితాలను గానీ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మీన రాశిలో రాహువు తన గురువైన శుక్రుడితో ఈ గ్రహం కలిసి ఉండడం వల్ల, గురు, శుక్రుల పరివర్తన జరిగినందువల్ల రాహువు పాప ఫలితాలను ఇవ్వకుండా ఎక్కువగా శుభ ఫలితాలనే ఇవ్వనుండటం విశేషం.
Telugu Astrology
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Feb 08, 2025 | 5:22 PM
జ్యోతిషశాస్త్రం ప్రకారం మొత్తం తొమ్మిది గ్రహాల్లో అత్యంత పాప గ్రహమైన రాహువు ప్రస్తుతం మీన రాశిలో సంచరించడం జరుగుతోంది. సాధారణంగా రాహువు స్వతంత్రంగా ఫలితాలనివ్వడు. తాను ఉన్న రాశి నాథుడి ఫలితాలను గానీ, తనతో కలిసి ఉన్న గ్రహం ఫలితాలను గానీ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మీన రాశిలో రాహువు తన గురువైన శుక్రుడితో ఈ గ్రహం కలిసి ఉండడం వల్ల, గురు, శుక్రుల పరివర్తన జరిగినందువల్ల రాహువు పాప ఫలితాలను ఇవ్వకుండా ఎక్కువగా శుభ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. రాహువు వల్ల గత ఏడాదిన్నరగా ఇబ్బంది పడుతున్న మేషం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారు ఇక నుంచి దాదాపు మే 18 వరకూ శుభ ఫలితాలనే పొందడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశికి 12వ స్థానంలో ఉండి అనవసర వ్యయాలను పెంచిన రాహువు ఇక ఖర్చుల్ని తగ్గిం చడం ప్రారంభం అవుతుంది. ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం లభించే అవ కాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరించే అవకాశం ఉంది. అదనపు ఆదాయాన్ని భద్రపరచుకోవడం, షేర్లు, స్పెక్యులేషన్లలో మదుపు చేసి లాభాలు పొందడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో రాహువు సంచారం వల్ల సాధారణంగా అనారోగ్యాలు, ధన నష్టం, బంధుమిత్రులతో విభేదాలు, పురోగతి చెందకపోవడం వంటి సమస్యలుంటాయి. అయితే, ప్రస్తుతం రాహువు అనుకూలంగా మారినందువల్ల ఆరోగ్య లాభం కలుగుతుంది. వారసత్వ సంపద లభి స్తుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
- కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల సాధారణంగా జీవిత భాగస్వామితో విభేదాలు, వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితం సవ్యంగా సాగిపోయే అవ కాశం ఉండదు. పెళ్లి సంబంధాలు తప్పిపోతుంటాయి. ఇక నుంచి ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో రాహు సంచారం వల్ల అప్రతిష్ఠపాలు కావడం, ఉద్యోగంలో పొరపాట్లు చేయడం, డీప్రొమోషన్ రావడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. సమర్థతకు ఒక పట్టాన గుర్తింపు లభించదు. ఇక ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. కొద్ది ప్రయ త్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.
- ధనుస్సు: ఈ రాశికి నాలుగవ స్థానంలో రాహు సంచారం వల్ల సుఖ సంతోషాలు, మానసిక ప్రశాంతత తగ్గడం జరుగుతుంది. ఆస్తిపాస్తులు వివాదాల్లో పడడం, రావలసిన ఆస్తి చేతికి రాకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. రాహువు అనుకూలంగా మారినందువల్ల కుటుంబంలోనూ, దాంపత్య జీవితంలోనూ సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇల్లు అమరుతుంది. మనశ్శాంతి ఏర్పడుతుంది.
- మీనం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాహువు వల్ల ముఖ్యమైన పనులు, వ్యవహారాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఏ పనీ సవ్యంగా సాగదు. ఏదో ఒక అనారోగ్యం పీడించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. ప్రస్తుతం రాహువు అనుకూలంగా మారడం వల్ల ప్రతి పనీ సునాయా సంగా పూర్తయి ఆర్థిక లాభాలు కలుగుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగం లోనే కాక, సామాజికంగా కూడా ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి.