మీరు కూడా ప్రతి నెలా ATM నుండి నగదు తీసుకుంటే లేదా డిజిటల్ చెల్లింపును ఉపయోగించకుండా నగదు చెల్లింపు చేస్తే, ఈ వార్త మీ కోసమే. ఏటీఎం నుండి నగదు తీసుకోవడం ఇప్పుడు ఖరీదైనది కావచ్చు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం నుండి నగదు ఉపసంహరణ రుసుములను పెంచబోతోంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఒక నెలలో 5 ఉచిత నగదు ఉపసంహరణలను అందించేది. కానీ ఇప్పుడు ఈ 5 లావాదేవీల పరిమితిని మించితే ఛార్జీలు, ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజులను పెంచాలని ఆర్బీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం మంగళవారం హిందూ బిజినెస్‌లైన్ నివేదికలో అందించింది. మీరు ఏటీఎం నుండి నగదు తీసుకోవడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఛార్జీ ఎంత పెరుగుతుంది?
హిందూ బిజినెస్‌లైన్ తన నివేదికలో.. ఈ విషయం తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ, ఐదు ఉచిత పరిమితులు పూర్తయిన తర్వాత నగదు ఉపసంహరణకు ఛార్జీని ప్రస్తుత రుసుము రూ.21 నుండి రూ.22కి పెంచాలని NPCI సిఫార్సు చేసిందని పేర్కొంది. దీనితో పాటు, నగదు లావాదేవీలకు ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ రుసుమును రూ.17 నుండి రూ.19కి పెంచాలని NPCI సిఫార్సు చేసింది. మరొక బ్యాంకు ఏటీఎం నుండి పరిమితికి మించి డబ్బును విత్‌డ్రా చేస్తే ఇంటర్‌చేంజ్ ఫీజు వసూలు చేయబడుతుంది. అంటే, ఇది ఏటీఎం సేవను ఉపయోగించుకున్నందుకు బదులుగా ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు చెల్లించే రుసుము.
ఆర్‌బీఐ సమావేశం
నివేదిక ప్రకారం.. మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో రుసుములను పెంచాలనే ఎన్‌పీసీఐ సిఫార్సుతో బ్యాంకులు, వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఏకీభవిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్‌పీసీఐ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరుగుతోంది:
గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం పెరగడం, రుణ వ్యయాలు 1.5-2 శాతం పెరగడం, రవాణా ఖర్చులు, నగదు నింపడం, ఇతర మెట్రో నగరాల్లో ఏటీఎంల నిర్వహణ ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి