పెర్త్ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తు చేస్తూ రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు నమోదు చేసింది. యశస్వి జైస్వాల్ (161) కు తోడు విరాట్ కోహ్లీ (100 నాటౌట్) కూడా సెంచరీబాదడంతో భారత్ భారీ స్కోరుతో డిక్లేర్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం లాంఛనమే.
Virat Kohli
పెర్త్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టు లో టీమిండియా ఆస్ట్రేలియాకు భారీ విజయ లక్ష్యాన్ని విధించింది. విరాట్ కోహ్లీ (100 నాటౌట్), యశస్వి జైస్వాల్ (161) సెంచరీలతో అదరగొట్టడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల 487 పరుగులు చేసింది. మొదట ఇన్నింగ్స్ ఆధిక్యం కలిపి ఆసీస్ ఎదుట 534 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (77) అర్ధశతకం సాధించగా.. పడిక్కల్ (25), సుందర్ (29) ఫర్వాలేదనిపించారు. ఇక ఆఖరులో తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి (27 బంతుల్లో 38 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు ) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులు చేయగా, ఆసీస్ 104 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
Test Century No.30!
All hail, King Kohli 🫡👏👌
Live – https://t.co/gTqS3UPruo…… #AUSvIND pic.twitter.com/VkPr1YKYoR
— BCCI (@BCCI) November 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.