Avika Gor: కాపాడతాడని ఉద్యోగమిస్తే.. నాతోనే అసభ్యంగా ప్రవర్తించాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

2 hours ago 1

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారింది అవికా గోర్. బాలనటిగా బుల్లితెరపై సందడి చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్‏గా వెండితెరపై అలరిస్తుంది. పన్నెండేళ్ల వయసులోనే నటన రంగంలోకి అడుగుపెట్టిన అవిక.. అతి చిన్న వయసులోనే ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. తెలుగులో ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ మూవీతో హిట్ అందుకుంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన అవికా.. తాజాగా హాట్‌ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన కొన్ని చేదు సంఘటనల గురించి చెప్పింది. తనను కాపాడతాడని ఉద్యోగం ఇచ్చిన ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.

పెద్దయ్యాక ఎన్నో హింసలు, సవాళ్లు ఎదుర్కొన్నానని అవికా చెప్పుకొచ్చింది. తనను రక్షించాల్సిన బాడీగార్డు తనతో అనుచితంగా ప్రవర్తించాడని వెల్లడించింది. ఓ ఈవెంట్‌లో బాడీగార్డు తనను దారుణంగా తాకాడని నటి తెలిపింది. అతను రెండుసార్లు అలాగే ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. అతడు తనతో అసభ్యంగా ప్రవర్తించగానే ..అతడి వైపు చూసి ఏంటీ అని అడగ్గా.. వెంటనే తనకు సారీ చెప్పాడని.. దీంతో ఆ సంఘటనను వదిలేశానని.. వారు అలా ప్రవర్తించినప్పుడు.. అది ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని వారికి తెలియదని.. అలా ప్రవర్తించినప్పుడు అతడిని కొట్టే ధైర్యం ఉంటే.. ఈపాటికి చాలా మందిని కొట్టేదానినని తెలిపింది.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

కానీ ఇప్పుడు తనకు ఆ ధైర్యం ఉందని.. తనతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని కొట్టగలనని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. తనలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అవికాకు అంతగా అవకాశాలు రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article