సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతినెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలలో బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఫిబ్రవరి 12న కూడా బ్యాంకులు మూసి ఉంటాయని సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ 12న బ్యాంకులు మూసే ఉంటాయా? చాలా మంది బ్యాంకు వినియోగదారులు ఎందుకు మూసి ఉంటాయోనన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏయే రాష్ట్రాల్లో మూసి ఉంటాయా? ఎందుకోసమో పూర్తి వివరాలు తెలుసుకుందాం..
హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం బ్యాంకులు మూసి ఉంటాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు తెరిచే ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను నమ్మి నిజంగానే బుధవారం మూసి ఉంటాయని చాలా మంది భావిస్తున్నారు. బ్యాంకులు బంద్ అనేది అన్ని రాష్ట్రాల్లో కాదు. కేవలం హిమచల్ ప్రదేశ్‌లో మాత్రమే మూసి ఉండనున్నాయి.
ఉత్తర భారతదేశంలో గురు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు సాధువు గురు రవిదాస్ జీ బోధనలను, సమాజానికి ఆయన చేసిన కృషిని గౌరవించడానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఫిబ్రవరి 2025 లో బ్యాంకు సెలవుల జాబితా – రాష్ట్రాల వారీగా
- ప్రతి నెలా అన్ని జాతీయ, స్థానిక పండుగలు, వార్షికోత్సవాలు, ఆదివారాలు, రెండవ శనివారాలు, నాల్గవ శనివారాలలో బ్యాంకులు మూసి ఉంటాయి. అన్ని బ్యాంకు శాఖలు మొదటి, మూడవ, ఐదవ శనివారాలలో తెరిచి ఉంటాయి. ఫిబ్రవరి నెలలో బ్యాంకులు 14 రోజుల పాటు సెలవులు వచ్చాయి.
- ఫిబ్రవరి 11: తైపూసం సందర్భంగా చెన్నైలో బ్యాంకులకు సెలవు
- ఫిబ్రవరి 12: సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు.
- ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నాడు బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి.
- ఫిబ్రవరి 20: రాష్ట్ర దినోత్సవం నాడు ఐజ్వాల్, ఇటానగర్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి.
- ఫిబ్రవరి 26: అహ్మదాబాద్, ఐజ్వాల్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురంలో మహాశివరాత్రి నాడు బ్యాంకులు మూసి ఉంటాయి.
ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు షాకింగ్.. రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి