పెరుగుతో డైమండ్ ఫేషియల్ చేయొచ్చని మీకు తెలుసా..? పెరుగు ఒక అద్భుతమైన సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది చర్మానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై ముడతలు, గీతలు తగ్గించి, బ్లీచింగ్ వలె పనిచేస్తుంది. ముఖానికి సహజమైన కాంతిని తెస్తుంది. పెరుగుతో ఫేషియల్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుల్లటి పెరుగుతో ఫేషియల్
ముందుగా ఫేస్ క్లీన్ గా వాష్ చేయండి. తడి ఆరాక ఇప్పుడు కొద్దిగా పుల్లని పెరుగు తీసుకొని ఈ పెరుగును ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేయండి. అంతే సింపుల్ ఇలా చేయడం వల్ల చర్మంపై ముడతలు, గీతలు తగ్గుతాయి. బ్లీచింగ్ చేసినట్లుగా ఉంటుంది. ఇందులోని లాక్టిక్ యాసిడ్ అనేక విధాలుగా హెల్ప్ చేస్తుంది.
షుగర్, కాఫీతో స్క్రబ్
పెరుగు, పంచదార, కాఫీ పొడిని కలిపి పేస్ట్ లా చేయండి. ఈ స్క్రబ్‌ను ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయండి. 5 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయండి. దీని వల్ల బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి.
టమాట గుజ్జుతో స్కిన్ గ్లో
టమాట గుజ్జు, పెరుగును కలిపి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయండి. వారానికి ఒకసారి, నెలకి రెండు సార్లు ఇలా చేయండి. ఈ ఫేషియల్‌ని వారానికి ఒకసారి లేదా నెలలో రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై డల్‌నెస్, ముడతలు తగ్గి, కాంతివంతంగా మారుతుంది.
ఈ సహజ ఫేషియల్స్ మీ చర్మానికి నేచురల్ గ్లోను తెచ్చిపెడతాయి. డైమండ్ ఫేషియల్ కోసం ఖరీదైన ట్రీట్‌మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సహజంగా చేయగలిగే ఈ చిట్కాలతో మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.