వేడి వేడి చికెన్ ర్యాప్.. అబ్బ నోరూరించే అద్భుతమైన ఫుడ్ రెసెపీ.. అయితే.. అలాంటి చికెన్ ర్యాప్‌ను తినేందుకు ఓ మహిళ ఫేమస్ కేఫ్ కు వెళ్లింది.. అక్కడ ఆర్డర్ ఇవ్వగానే.. వెయిటర్ తెచ్చి ఇచ్చాడు.. చికెన్ వ్రాప్ ను నోట్లో పెట్టుకోగానే అనుకోని సంఘటన ఎదురైంది.. ముందు కొంచెం తిన్నది .. ఆ తర్వాత మరోసారి దానికి కొరకగానే.. ఏదో పదునైన వస్తువు తగిలింది.. చికెన్ ర్యాప్ లో కత్తి ఉండటంతో దెబ్బకు షాకైంది.. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. వివరాల ప్రకారం.. ఒక ఆస్ట్రేలియన్ కంటెంట్ క్రియేటర్.. స్థానిక కేఫ్ నుంచి చికెన్ ర్యాప్ ను ఆర్డర్ చేసింది.. అయితే.. ఆమె ఆ చికెన్ ర్యాప్‌లో కత్తిని కనుగొనడంతో తృటిలో గాయం నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత.. దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఆమె కథనం వైరల్ అయ్యింది.. ఇది సోషల్ మీడియాలో ఆందోళన.. అవిశ్వాసాన్ని రేకెత్తించింది.
ఆస్ట్రేలియన్ మహిళ తాను.. చికెన్ వ్రాప్ లో కత్తిని కనుగొంది.. అయితే.. ఈ సమయంలో గాయం నుంచి తృటిలో తప్పించుకున్నప్పుడు షాకింగ్ అనుభవం ఎదురైంది. సౌకర్యవంతమైన ఫుడ్ డెలివరీ సేవలు బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ, ఈ సంఘటన సంభావ్య ప్రమాదాలను నొక్కి చెబుతుంది..
ఈ మేరకు ఎమిలీ అనే కంటెంట్ క్రియేటర్ అయిన మహిళ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆకలితో ఉన్న ఆమె స్థానిక కేఫ్ నుండి చికెన్ ర్యాప్ ఆర్డర్ చేసింది. ఆమె తినడం ప్రారంభించినప్పుడు.. ఆమె ఊహించని విధంగా గట్టిగా ఒక్కసారిగా దాన్ని కొరికింది.
మొదట్లో దానిని క్యారెట్‌గా భావించానని.. ఈ సమయంలో గట్టిగా కొరికానని.. కానీ.. అది గుచ్చుకోలేదని పేర్కొంది.. చికెన్ వ్రాప్ ను పరిశీలించినప్పుడు.. ఆరెంజ్ కలర్ హ్యాండిల్‌తో ఉన్న కత్తిని ఆమె కనుగొంది. అయితే.. ఆ పదునైన కత్తి భాగం కింద ఉండటంతో తృటిలో ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిపింది.
అయితే.. ఎమిలీ కథనం వైరల్ అయింది.. నెటిజన్లు ఈ ఘటనపై కామెంట్లు చేయడంతోపాటు.. షేర్ చేస్తూ.. కేఫ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.. దీంతోపాటు.. ఆందోళన, అవిశ్వాసం వ్యక్తం చేశారు.
తమాషా.. ఇది భయానకంగా ఉంది ఉందంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా.. మరికొందరు ఆమె బాధాకరమైన అనుభవానికి పరిహారం కోరవచ్చని సూచించారు. కొంతమంది వినియోగదారులు హాస్యంతో ప్రతిస్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..