ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ నిజం చెప్పాలనుకుంటే.. కావ్య ఆపుతుంది. ఇందులో మీకేంటి సంబంధం? ఆ హౌట్ హౌస్ తాకట్టు పెట్టింది నేను. మీకు ఎలాంటి సంబంధం లేదని అంటుంది. ఏ వీళ్లిద్దరికీ జవాబు చెప్పకపోతే తల తీసి మొలేస్తారా? ఆస్తి మొత్తం నా పేరు మీద ఉంది. చెప్పాలి అనిపిస్తే నేనే చెప్పాలి. లేదనిపిస్తే లేదు.. మీరు మాట్లాడకండి అని కావ్య అంటే.. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వదినా అంతా అయిపోయింది.. నీ కొడుకుని తోలుబొమ్మని చేసి ఆడిస్తుందని రుద్రాణి అంటుంది. రుద్రాణి నువ్వు రెచ్చగొట్టకు.. ఏ కారణంతో నా కోడలు నా కొడుకును ఆగమందో నాకు అర్థమైంది. అదేంటో నేను కనుక్కుంటా.. చూడమ్మా.. ఆస్తి మొత్తం నీ పేరు మీదే ఉంది. నేను కాదనడం లేదు. కానీ అప్పు తీసుకుంది పెద్ద అమౌంట్ కదా.. అది తాకట్టు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది తెలుసుకునే హక్కు మాకు లేదా? అని సుభాష్ అడిగితే.. చూడండి మామయ్య గారు తాతయ్య గారు నన్ను నమ్మి ఆస్తి మొత్తం నా పేరు మీద రాశారు. దాన్ని తాకట్టు పెట్టే హక్కు నాకు ఉంది. కానీ ఎందుకు? అని అడిగే హక్కు మాత్రం ఈ ఇంట్లో ఎవరికీ లేదని కావ్య అంటుంది.
కావ్యని కొట్టబోయిన అపర్ణ..
అది విని ఇంట్లోని వాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కావ్య.. ఏం మాట్లాడావు? ఎంత ధైర్యం నీకు? నా భర్తనే ఎదురించి మాట్లాడే హక్కు లేదంటావా? అని కొట్టబోతుంది అపర్ణ. దీంతో సుభాష్ ఆపుతాడు. దీంతో కావ్యని రాజ్ తీసుకెళ్తాడు. ఏంటి అన్నయ్యా ఇది? అసలు కావ్య నిన్ను అని ప్రకాశం అనబోతే.. సుభాష్ ఆపేస్తాడు. మరోవైపు దొరికిందే ఛాన్స్ కదా అని రుద్రాణి అందర్నీ రెచ్చగొట్టేలా మాట్లాడుతూ అది మామూలు ఆడది కాదని అంటుంది. ఇక గదిలోకి బాధ పడుతూ రాజ్, కావ్యలు వస్తారు. ఏవండీ మీకు నా మీద ఎలాంటి కోపం లేదు కదా.. ఏమీ అనరా.. నేను దేవుడి లాంటి మావయ్య గారిని పట్టుకుని మీకు అడిగే హక్కు లేదని నోరు జారాను. ఇది కావాలనే అన్నాను. మీకు అర్థం కాలేదా? అని కావ్య అంటే.. అర్థమైందని రాజ్ అంటాడు. మరి కోపం రాలేదా అని కావ్య అడిగితే.. కోపం వచ్చింది.. మన బాధ్యత మీద.. మనల్ని మోసం చేసిన వాడి మీద.. నిజం చెప్పకుండా నిన్ను దోషిని చేసిన నా అసమర్దత మీద అని రాజ్ అంటాడు.
నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటా..
నువ్వూ మనిషివే కళావతి.. అది గుర్తించడానికి నాకు చాలా టైమ్ పట్టింది. నిజం బయట పెట్టలేక.. బాధను భరించలేక.. ఇంట్లో వాళ్లు వేసిన నిందలను ఎంతో ఓపికతో భరించగలుగుతున్నావు. మన దురదృష్టం బాలేక.. అంతా శూన్యమైపోయింది. చివరి అవకాశం కూడా పోయింది. తాతయ్య ఇచ్చిన మాట నిలబెట్టాలి.. అప్పు కట్టాలి.. ఇన్ని సమస్యల మధ్య ఇంట్లో నిలబడి దోషిలా నిలబడి సమాధానం చెప్పాలి. తప్పంతా నీ మీదే వేసుకున్నావు. బాధ పెట్టే నిజం చెప్పడం కన్నా.. సంతోషం పెట్టే అబద్ధం చెప్పడం మేలు అంట.. ఇదంతా చూసి కూడా ఇంకా నిన్ను అపార్థం చేసుకుంటే.. నా అంత మూర్ఖుడు ఎవడూ ఉండడు. మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. నాకు తెలిసి మా నాన్న నిన్ను అపార్థం చేసుకోడు. భార్య అంటే భర్త కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి అనుకుంటారు.. కానీ నువ్వు అత్తింటి కష్టాన్ని నీ కష్టంగా మార్చుకున్నావు. ముఖ్యంగా ఆస్తులు పోయే సమయంలో నాకు అండగా నిలబడ్డావు. భర్తగా నేను నీకు ఎప్పుడూ ఏమీ చేయలేదు. కానీ ఇక నుంచి నీ మనసు కష్టపెట్టకుండా చూసుకుంటానని రాజ్ అంటే.. కావ్య ఒక్కసారిగా ఏడుస్తూ కౌగిలించుకుంటుంది.
ఇవి కూడా చదవండి
కళ్యాణ్ బాధ.. అప్పూ ఓదార్పు..
మరోవైపు కళ్యాణ్ పాటలు రాస్తూ ఉండగా.. అనామిక అప్పూని అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుని బాధ పడుతూ ఉంటాడు. అప్పుడే అప్పూ అన్నం పట్టుకుని వస్తుంది. ఏంటి కవిగారు అంత కోపంగా ఉన్నారు? అని అడుగుతుంది. ఆ అనామిక మీద.. నిన్ను అన్ని మాటలు అన్నాక నాకు చాలా బాధగా ఉంది. చాలా కోపం వచ్చిందని కళ్యాణ్ అంటాడు. ఏంటో నువ్వు ఈ మధ్య నా కంటే నీకే ఎక్కువగా కోపం వస్తుంది అనుకుంటా.. పాట రాయమని అప్పూ అంటే.. ఇంట్రెస్ట్ రావడం లేదని కళ్యాణ్ అంటే.. కళ అన్నా.. కవి అంటే అంతే.. ఎలాంటి మూడ్‌లో ఉన్నా భావాన్ని అర్థం చేసుకుని రాయాలని అంటుంది అప్పూ. నువ్వు పోలీస్ అవ్వాలని ఎంతో కష్ట పడి పాస్ అయి ట్రైనింగ్ తీసుకుంటున్నావు. నీ ప్రాణం పోయినా.. నువ్వు చీమకు కూడా హాని చేయవు. తప్పు చేస్తే.. నన్ను అయినా అరెస్ట్ చేస్తావని కళ్యాణ్ అంటాడు. ఆపురా భయ్ నువ్వు మరీ ఎక్కువగా మోసేస్తున్నావు.. సరే తినమని అప్పూ అంటే.. తినని కళ్యాణ్ అంటాడు.
అయోమయంలో సుభాష్..
నేను రేపు వెళ్లిపోతానని తెలిసి కూడా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు.. నాకు బాగా ఆకలిగా ఉంది.. అయినా నేను తినని అప్పూ అంటే.. కళ్యాణ్ కదిలి వచ్చి.. అప్పూకి ముద్దలు కలిపి తినిపిస్తాడు. మరోవైపు సుభాష్‌తో మాట్లాడుతూ ఉంటాడు ప్రకాశం. ఏంటి అన్నయ్యా నీకు అంత అవమానం జరిగినా ఏమీ మాట్లాడకుండా ఉన్నావు. నువ్వు ఒక్కడివే మాకు అండగా ఉన్నావు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని ప్రకాశం అంటాడు. అదంతా అక్కడే ఉన్న కావ్య విని చాలా బాధ పడుతుంది. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..