న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను 86 రోజుల ముందుగానే బోర్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. 10, 12 తరగతులకు సన్నద్ధమైన విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత విద్యార్థులు లేదా ఆయా పాఠశాలలు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.
సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షల అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా ఇప్పటికే సీబీఎస్సీప్రాక్టికల్ పరీక్షలు జనవరిలో ముగియగా.. 10వ తరగతి, 12వ తరగతికి సంబంధించిన థియరీ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్/ప్రాజెక్ట్/ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు సంబంధించి మార్కులను అప్‌లోడ్ చేసేటప్పుడు పాఠశాలలు కొన్నిసార్లు తప్పులు చేస్తున్నాయని, ఈ సారి ఈ విధమైన తప్పులు చోటు చేసుకోకుండా.. ఆయా పాఠశాలలకు ప్రాక్టికల్, ప్రాజెక్ట్, అంతర్గత మూల్యాంకనం, థియరీ పరీక్షలను సజావుగా నిర్వహించడంలో సహాయపడటానికి సబ్జెక్టుల జాబితా సమాచారం వివరాలను కూడా బోర్డు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. అన్ని రోజుల్లోనూ పరీక్షలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఇవి కూడా చదవండి
సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షల పూర్తి టైం టేబుల్ ఇదే..
సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల పూర్తి టైం టేబుల్ ఇదే..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.