ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ దూరం కావడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అలాగే స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా ఈ టోర్నమెంట్‌కు అందుబాటులో ఉండడం లేదని ఆస్ట్రేలియా మీడియా నివేదించింది. కోడ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం, రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్ ఇద్దరూ కనిపించరు. కమ్మిన్స్ కాలి గాయంతో బాధపడుతున్నందున, అతను ఐసిసి టోర్నమెంట్‌లో ఆడే అవకాశం లేదని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ధ్రువీకరించారు. ఇక చీలమండ గాయంతో బాధపడుతున్న జోష్ హాజిల్‌వుడ్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. అతను కూడా రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగాలని కూడా నిర్ణయించుకున్నాడని కోడ్ స్పోర్ట్స్ నివేదించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ ఇద్దరూ ఆస్ట్రేలియా పేసర్లు అందుబాటులో ఉండరని తెలుస్తోంది.
కాగా కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ను జట్టుకు దూరమైతే, ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌గా మరొకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు అన్ని టోర్నమెంట్లలోనూ విజయాలు సాధించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, వన్డే ప్రపంచ కప్ తోపాటు ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ విజయాలు కూడా కమిన్స్ నేతృత్వంలో సాధించినవే. కమిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా ఆడుతోంది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి పాట్ కమ్మిన్స్ అందుబాటులో లేకపోవడం ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టే.
ఇవి కూడా చదవండి
🚨 BIG BLOW for Australia!🚨
Pat Cummins is highly improbable to play successful the Champions Trophy owed to injury, portion Josh Hazlewood is inactive battling for fitness. 😱
With Cummins out, Steve Smith oregon Travis Head could pb Australia successful the tournament! 🏆🇦🇺 #ChampionsTrophy pic.twitter.com/6zHrjfFSSL
— ARV Loshan Sports (@ARVLoshanSports) February 5, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు:
అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా, పాట్ కమ్మిన్స్ , జోష్ హాజిల్‌వుడ్
🚨Pat Cummins and Josh Hazlewood are improbable to beryllium acceptable for the Champions Trophy which starts successful 2 weeks clip 😮
How large of a stroke volition it beryllium for Australia? 👇#patcummins #joshhazlewood #australiacricket #australia #odi pic.twitter.com/I9b8PbSDdZ
— Cricbuzz (@cricbuzz) February 5, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..