ఒత్తిడి కారణంగా ముఖ్యంగా గుండెపై ఇంపాక్ట్ పడి ఇది చివరకు ప్రాణాలు తీసేంతలా ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. దీన్నే క్రానిక్ స్ట్రెస్‌గా చెబుతున్నారు. ఈ క్రానిక్ స్ట్రెస్ కారణంగా..పదేపదే చిరాకు పడడం, జీర్ణ వ్యవస్థలో సమస్యలు తలెత్తడంతో పాటు రోగనిరోధక శక్తి మందగిస్తుంది. ఇది మొత్తంగా ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. శారీరకంగానే కాదు. మానసికంగానూ కుంగుబాటుకు గురి చేసే ప్రమాదముంది. మరో కీలకమైన విషయం ఏంటంటే..బిహేవియరల్ సింప్టమ్స్ కనిపిస్తాయని అంటున్నారు వైద్యులు. అంటే..ప్రవర్తనలో అనూహ్యంగా మార్పులు రావడం. ఊరికే అరవడం, భావోద్వేదాలు కంట్రోల్‌లో ఉండకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో పాటు గుండె వేగంగా కొట్టుకోవడం, యాంగ్జిటీ, డిప్రెషన్, ఇరిటేషన్, తరచూ తలనొప్పి, నిద్రలేమి..ఇలా ఎన్నో జబ్బులకు దారి తీస్తుంది..ఈ క్రానిక్ స్ట్రెస్.
ఈ జబ్బు ఇలా కంటిన్యూ అవడం వల్ల అది మొత్తంగా గుండె పని తీరుపై ప్రభావం చూపించడంతో పాటు గుండెపోటు వచ్చే ప్రమాదాన్నీ పెంచుతుంది. అయితే..చాలా మంది యాంగ్జిటీగా ఉన్నప్పుడు వెంటనే ఆల్కహాల్ లేదా సిగరెట్‌కి అలవాటు పడిపోతారు. వాటిని స్ట్రెస్ రిలీఫ్‌గా భావిస్తుంటారు. కానీ..వాటి కారణంగా గుండె జబ్బులు ఇంకా పెరిగే ప్రమాదముంటుంది. అయితే…ముందస్తుగా ఈ లక్షణాలను గుర్తిస్తే ఈ జబ్బు నుంచి బయటపడేందుకు అవకాశముంటుందని చెబుతున్నారు వైద్యులు. స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. రోజూ వ్యాయామం చేయడం, మెడిటేషన్, డీప్ బ్రీథింగ్ ఎక్సర్‌సైజెస్‌తో చాలా వరకూ స్ట్రెస్ తగ్గించుకునేందుకు వీలుంటుందని అంటున్నారు. వీటితో పాటు డాక్టర్ సలహా తీసుకుని అందుకు తగ్గట్టుగా స్ట్రెస్ రిలీఫ్‌కి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ ఒత్తిడి వల్ల మరో ప్రమాదం కూడా ఉంది. ఒత్తిడి పెరిగే కొద్దీ..క్రమంగా బరువు పెరుగుతారు. ఇదొక్కటే కాదు. ఇస్నోమియా వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇంకా రకరకాల జబ్బులు వచ్చే ప్రమాదమూ ఉంది. అందుకే..వీలైనంత వరకూ స్ట్రెస్ తగ్గించుకునే మార్గాలు వెతుక్కోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి