గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం గేమ్ ఛేంజర్. వినయ విధేయ రామ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి రామ్ చరణ్ తో జోడి కట్టింది. అంజలి మరో హీరోయిన్ గా యాక్ట్ చేయగా, ఎస్ జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో అదరగొట్టాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబెట్టుతోంది.
రామ్ చరణ్ సినిమా కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగా రికార్డులు కొల్లగొట్టింది. అలాంటి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాలో ఓ ఐఏఎస్ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగిన పోరాటాన్ని సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కించారు శంకర్. ఇక ఇందులో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే తమన్ అందించిన పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన గేమ్ ఛేంజర్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 07 నుంచి గేమ్ ఛేంజర్ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రియల్ తండేల్ రాజు ఇతనే.. కథ వింటే కన్నీళ్లాగవు
అవును.. అలా పెట్టడం నా తప్పేనండీ.. క్షమించండి..
సినిమా సెట్ లోకి గ్రాండ్ వెల్ కం.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న జానీ