సాధారణంగా శీతాకాలంలో చలి తట్టుకోలేక చలిమంటలు వేసుకుంటుంటారు చాలామంది. ఇందుకు ఎండుటాకులు, గడ్డి లాంటివి ఉపయోగిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి చలి కాచుకోడానికి ఆకుడు, గడ్డిలాంటివేవీ అందుబాటులో లేకపోవడంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి చలి మంటవేసుకున్నాడు. అదెలాగో.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి.
ఓ వ్యక్తి రోడ్డు పక్కన కూర్చుని ఉన్నాడు. చలి తీవ్రంగా ఉండటంతో చలి కాచుకోడానికి మంట వేసుకోవాలనుకున్నాడు. అందుకు కావలసిన గడ్డిగానీ, చెత్తగానీ అతనికి దొరకలేదు. దాంతో అతను ఓ ఐడియా వేశాడు. ఇంట్లోకి వెళ్లి సిలిండర్‌ను బయటికి తీసుకొచ్చి దానికి నిప్పు పెట్టాడు. సిలిండర్‌కు మంట అంటుకున్న తర్వాత, దాని పక్కనే కూర్చుని తాపీగా చలి కాచుకున్నాడు. ఆ సమయంలో అతడిలో సిలిండర్ పేలుతుందన్న భయం కొంచెం కూడా కనిపించలేదు. అంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. అయితే అతను కూడా విచిత్రంగా సిలిండర్ మంటతో చలి కాచుకున్నాడు.
ఇవి కూడా చదవండి
ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. వారి వెనుకే కొన్ని పెట్రోల్ బాటిళ్లు కూడా ఉన్నాయి. పొరపాటున వాటికి మంటలు అంటుకుని ఉండుంటే.. పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వామ్మో.. ఇతను మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాక్కూడా చలిమంట కాచుకుంటారా’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం ఎంతో ప్రమాదకరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను 10 మిలియన్లమందికి పైగా వీక్షించారు. 4 లక్షలమందికి పైగా లైక్‌చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి