న్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Ntr
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఎక్కడ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. రాజమౌళి సినిమా తర్వాత ఎక్కడ ఫ్లాప్ పడుతుందో అని అభిమానులు ఆందోళన పడ్డారు. కానీ దేవర సినిమా హిట్ అవ్వడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 27న దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది.. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 550కోట్ల వరకు కలెక్ట్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుసగా సినిమాలను లైనప్ చేశారు. దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మొదటి భాగం విడుదలై బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం చూస్తున్నారు ఫ్యాన్స్.
అలాగే ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో వార్ 2లో నటిస్తున్నాడు తారక్. స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో తారక్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో తారక్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత సాలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. సలార్ సినిమాను ప్రశాంత్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నడు . ఇక ఈ సినిమాలతో పాటు ఎన్టీఆర్ తో సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ సినిమాలో టోవినో థామస్ నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. సలార్ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలోనూ టోవినో థామస్ నటిస్తున్నాడని అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి