బంగారం ధరలు రన్ రాజా రన్ అంటూ పరుగు తీస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82వేలు దాటింది. ఇది ఇంతటితో ఆగుతుందా? లక్ష మార్క్ దాటుతుందా? పసిడి ప్రియులకి ఇక కన్నీళ్లేనా? అన్న ఆందోళన మొదలైంది. 23 జనవరి ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Gold Price
తెలుగు ప్రజలు బంగారం అంటే ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ శుభకార్యమైనా బంగారానికి పెద్ద పీట వేస్తారు మనవాళ్లు. అంతలా మన సంస్కృతిలో భాగమైంది బంగారం. అంతేకాదు ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారికి సైతం ఓ మంచి సాధనం అయింది. అయితే గోల్డ్ ఇప్పుడు సామాన్యులకు అందనంటోంది. బంగారం ధరలు రన్ రాజా రన్ అంటూ పరుగు తీస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82వేలు దాటింది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం తర్వాత బంగారం ధర కొత్త గరిష్టస్థాయికి పెరిగింది. ఇన్వెస్టర్లు స్టాక్‌మార్కెట్‌పైన సెంటిమెంట్ దెబ్బతినడంతో తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారం వైపు తరలిస్తున్నారు. దీనికి తోడు ప్రపంచ స్థాయిలో సెంట్రల్ బ్యాంక్‌లు పలు దేశాల్లో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా పసిడి ధరలు పెరగడానికి కారణమవుతోంది. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం… బుధవారం బుధవారం 24 క్యారెట్ల.. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.82,200 ఉండగా, గురువారం రూ.500 పెరిగి రూ.82,700కు చేరింది. బుధవారం కేజీ వెండి ధర రూ.93,870 ఉండగా, గురువారం నాటికి రూ.50 పెరిగి రూ.93,920కి ఎగబాకింది.
- హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.82,700గా ఉంది. కిలో వెండి ధర రూ.93,508కి చేరింది
- విజయవాడలో పది గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.82,180గా ఉంది. కిలో వెండి ధర రూ.94,400గా ఉంది.
- విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.81,500గా ఉంది. కిలో వెండి ధర రూ.93,200గా ఉంది.
పైన ఇచ్చిన ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొనేముందు మరోసారి చెక్ చేసుకుంటే బెటర్..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..