అప్పుల భారం జీవితం మీద బరువుగా మారుతుంటుంది. సంపాదన ఎంత వచ్చినా చేతిలో నిలువదు, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడంలో జాప్యం జరుగుతుంది. పలు కారణాల వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుండవచ్చు. ముఖ్యంగా వాస్తు దోషాలు కూడా ఇందుకు కారణమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని వాస్తు మార్పులను పాటించడం ద్వారా రుణ భారం నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఆకస్మిక ఆర్థిక లాభాలకూ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యల పరిష్కారం కోసం కొన్ని వాస్తు చిట్కాలు తెలుసుకుందాం.
ఉత్తర దిశలో డబ్బు నిల్వ
వాస్తుశాస్త్రం ప్రకారం డబ్బు నిల్వ చేసే ప్రదేశం ఉత్తర దిశలో ఉండాలి. ఈ దిశలో డబ్బు ఉంచడం వల్ల రుణాల భారాన్ని తగ్గించడమే కాకుండా కొత్త ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని నమ్ముతారు. అలాగే డబ్బు నిల్వ చేసే ప్రదేశం ఎల్లప్పుడూ శుభ్రంగా, సమయానికి క్రమబద్ధంగా ఉంచడం ఎంతో అవసరం.
కిచెన్ కలర్స్ ప్రభావం
మీ వంటగదిలో నీలం రంగును ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ రంగు ఆర్థిక నష్టాలను సూచిస్తుంది. నీలం రంగు బదులు ఆకుపచ్చ లేదా పసుపు రంగులను ఉపయోగించవచ్చు. ఈ రంగులు శక్తిని ప్రోత్సహించి ఆర్థిక ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
కిటికీ ఫ్రేముల కలర్స్
ఇంటిలో ఉన్న కిటికీ ఫ్రేములు ఎరుపు లేదా సింధూర రంగులో ఉంటే ఇది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆ రంగులు ఇష్టపడకపోతే ఆకుపచ్చ లేదా పసుపు రంగులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ చిన్న మార్పు రుణాల బరువును తగ్గించడంలో దోహదపడుతుంది.
మంగళవారం రుణ చెల్లింపులు
మీ రుణాలు చెల్లించడానికి మంగళవారాన్ని ఎంచుకోవడం ఒక శుభకార్యం. వాస్తు నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజున రుణాలను చెల్లిస్తే మిగతా అప్పుల భారం క్రమంగా తగ్గుతుందట. మంగళవారం ఈ పని చేసి చూడండి. దీని ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఈశాన్య దిశలో గ్లాస్ కిటికీ
ఇల్లు లేదా ఆఫీస్ లో ఈశాన్య దిశలో ఒక గ్లాస్ కిటికీ ఏర్పాటు చేయడం వాస్తు ప్రకారం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది ఇంట్లోకి ధనాన్ని ఆకర్షిస్తుంది. అలాగే రుణ భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. గ్లాస్ కిటికీని శుభ్రంగా ఉంచడం మరింత అవసరం.
వాస్తుశాస్త్రం ప్రకారం చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకువస్తాయి. ఇంటిని శుభ్రంగా, శాస్త్రోక్తంగా ఉంచడం ద్వారా రుణ భారం నుంచి విముక్తి పొందొచ్చు. పై చెప్పిన విధంగా పాటించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)