సాధారణంగా మనందరి ఇళ్లలో వంటకోసం ఏదో ఒక రూపంలో పచ్చి మిర్చిని వాడుతుంటారు. కూరలు, పచ్చళ్ళు, పప్పులు ఇలా దాదాపు అన్ని వంటల్లోనూ పచ్చిమిర్చిని వాడుతుంటారు. అయితే, పచ్చిమిర్చి ఆ వంటకానికి కారంతో పాటు రుచిని కూడా అందిస్తుంది. అయితే, పచ్చిమిర్చి కేవలం రుచి, ఘాటు కోసం మాత్రమే కాదు.. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఐరన్, పొటాషియం, విటమిన్లు సి, ఎ తో సహా అవసరమైన మరెన్నో విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్నాయి. ఇవన్నీ సరైన శారీరక పనితీరుకు కీలకమైనవి. అందుకే రోజుకు రెండు మూడు పచ్చి మిరపకాయలను తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
పచ్చి మిరపకాయలలో ఉండే ముఖ్య పదార్ధం క్యాప్సైసిన్…జీవక్రియను వేగవంతం చేస్తుంది. క్యాప్సైసిన్ వేడిని ఉత్పత్తి చేయడం ద్వారా జీవక్రియను పెంచుతుంది. పచ్చి మిరపకాయలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉండటమేకాకుండా, అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా కూడా పుష్కలంగా ఉంటాయి. మిరపకాయలలో విటమిన్ B5 ఉండటం వల్ల కొవ్వు ఆమ్లాల విచ్ఛిన్నం సులభం అవుతుంది. ఇక పచ్చి మిరపకాయల్లో కేలరీలు కూడా ఉండవు.
పచ్చి మిరపకాయల్లో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ విటమిన్ సి చర్మానికి మేలు చేస్తుంది. ముడతలు తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఫైటోన్యూట్రియెంట్స్ ముడతలు, మచ్చలు, మొటిమలు, దద్దుర్లకు సమర్థవంతంగా చికిత్స చేస్తాయి. ఇక విటమిన్ ఇ చర్మానికి మేలు చేసే సహజమైన నూనెలను అందిస్తుంది. పచ్చి మిరపకాయల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దీంతో కంటి చూపు మెరుగ్గా ఉండేందుకు సహాయపడతాయి.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.