బెండకాయ.. రుచికి బాగానే ఉన్నా బంకగా ఉంటుందని తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే దాంతో అనేక లాభాలున్నాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న అంశం ఓ పరిశోధనలో వెల్లడైంది. బ్రెజిల్‌లోని పరైబా స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ‘సెంటర్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఫుడ్ ప్రాజెక్టు’ పేరిట జరిపిన అధ్యయనంలో బెండకాయ అనేక రకాగా రోగాల బెండు తీస్తుందని తేలింది. బెండకాయలోని సహజసిద్ధమైన తేమజిగురు లేదా బంక మానవ శరీరంలోని పలు రుగ్మతల నివారణకు దోహదపడుతుందని తేలింది. పచ్చి బెండకాయను నానబెట్టడం ద్వారా వచ్చే జిగురును తీసుకోవడం ద్వారా అనేక రోగాలను తగ్గించుకోవచ్చని వారు వెల్లడించారు. ప్రముఖ ప్రచురణ సంస్థ యూరోపియన్ పాలిమర్ జర్నల్‌లో ఈ విషయం ప్రచురితమైంది.
బెండకాయలోని జిగురు పదార్ధాన్ని మూడు రకాలుగా తీసుకోవచ్చు. ఒక పచ్చిబెండకాయకు 1:6 నిష్పత్తిలో నీరు పోయాలి. ఉదయాన్నే ముక్కల్ని తీసేసి.. నీటిని తాగాలి. రెండో పద్ధతిలో రిఫ్రిజిరేటర్‌లో 4-5 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 12 గంటలు నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున ఈ నీళ్లను తాగాలి. ఇక మూడో విధానంలో ఆర్బిటల్ షేకర్లలో 522 వాట్ల అల్ట్రాసోనిక్ శక్తిని ఉపయోగించి 59 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 30 నిమిషాలు లేదా 55 నుంచి 65 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య 20 నుంచి 30 నిమిషాల వరకు నానబెట్టాలి. అనంతరం ఆ జిగురు పదార్ధాన్ని తీసుకోవాలి.
బెండకాయల్లో కంటే జిగురులో జింకు, క్యాల్షియం ఎక్కువ. ముఖ్యంగా యాంటీట్యూమర్, యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, హైపోగ్లైసీమిక్, యాంటీఅల్సరోజెనిక్ లక్షణాలు ఉంటాయి. బెండకాయలు నానబెట్టిన నీటిలో విటమిన్- ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందులోని పోషకాలు రక్తాన్ని శుద్ధిచేస్తాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. హైబీపీ తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయినీ తగ్గించవచ్చు. జీర్ణశక్తిని, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, బరువు తగ్గడంలో సాయపడుతుంది. పేగు ఆరోగ్యానికి దోహదం చేసి.. గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలను నివారిస్తుంది. కంటిచూపు సమస్య ఉన్నవారు రోజూ తాగితే మంచి ఫలితం ఉంటుంది. చర్మసంరక్షణకు ఉపయోగపడుతుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్తాయి. చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. బెండకాయల్లో ఉండే లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలకు జిగురు దోహదపడుతుంది. కూరగాయల్లో అద్భుత గుణాలుంటాయి. శాస్త్రీయ పరిశోధనల్లోనూ ఇదే రుజువవుతోంది. బెండ జిగురు ద్రావకం జబ్బుల బారిన పడకుండా నిరోధించడమే కాకుండా ఇప్పటికే ఉన్న జబ్బులను తగ్గిస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.