ప్రస్తుతం మన దేశంలో సిటీ, అమేజ్, ఎలివేట్ అనే మూడు రకాల కార్లను హోండా కంపెనీ విక్రయిస్తోంది. అయితే వీటి అమ్మకాలు మాత్రం అనుకున్నంత ఆశాజనకంగా లేవు. దీంతో మార్కెట్ లో విక్రయాలు పెంచుకునేందుకు కంపెనీ నిరంతరం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగానే హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ ను విడుదల చేసింది. హోండా సిటీ అపెక్స్ ను చూడగానే ఆకట్టుకునేలా మంచి లుక్ తో తీర్చిదిద్దారు. కొన్ని ఫీచర్లను అప్ గ్రేడ్ చేశారు. కస్టమర్లను ఆకర్షించే ఆరు రకాల రంగుల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. వీ, వీఎక్స్ అనే రెండు రకాల వేరియంట్లలో హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ విడుదలైంది. సాధారణ మోడల్ కంటే భిన్నంగా చూపించడానికి కొన్ని చర్యలు తీసుకున్నారు.
ఫ్రంట్ ఫెండర్, టెయిల్ గేట్ పై అపెక్స్ ఎడిషన్ అని ప్రత్యేకంగా బ్యాడ్జ్ డిజైన్ చేశారు. ఇంటీరియర్ ను గోధుమరంగులో తీర్చిదిద్దారు. సీటు బ్యాక్ రెస్ట్ పై అపెక్స్ ఎడిషన్ ఎంబోస్ వేశారు. కుషన్లపై కూడా ఇలాంటి బ్రాండింగ్ ఉంది. డాష్ బోర్డు, డోర్ ప్లాడ్లు, ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ పై సాఫ్ట్ టచ్ ఫినిషింగ్, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్ ఆకట్టుకుంటోంది. ఫీచర్లు, భద్రతా విషయాలకు వస్తే దాని సాధారణ మోడల్ మాదిరిగానే ఉంటాయి. 8 అంగుళాల టచ్ స్క్రీన్, వైర్ లెస్ ఫోన్ చార్జర్, సింగిల్ – పేన్ సన్ రూఫ్, సెమీ – డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లు బాగున్నాయి. అలాగే సిటీ సెడాన్ కారులో మాదిరిగానే సెఫ్టీ ఏర్పాటు చేశారు. ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అడాస్ వంటి వాటిని స్టాండర్డ్ గా ఇచ్చారు.
హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ పవర్ ట్రెయిన్ విషయానికి వస్తే 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. దీని నుంచి 121 పీఎస్ పవర్, 145 న్యూటన్ మీటర్ టార్క్ విడుదల అవుతుంది. ఈ కారు రూ.13.30 లక్షల నుంచి రూ.15.62 లక్షల (ఎక్స్ షోరూమ్)కు అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..