మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. అయితే, విలాసాల మీధ ఖర్చు పెరిగే సూచనలు న్నాయి. ఉద్యోగంలో పదోన్నతి కలగవచ్చు. బాధ్యతలు మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యో గులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. మిత్రుల సహాయంతో కొన్ని అత్యవసర వ్యవహారాలను పూర్తి చేస్తారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనుకోకుండా ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఇతర ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవ కాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవ హారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆదాయ వృద్ధి కారణంగా ఆర్థిక, రుణ సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి కొద్ది కోలుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకా లంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపో తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొందరు మిత్రుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవు తుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపో తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం నిలకడగా సాగిపోతుంది కానీ ఖర్చుల విషయంలో బాగా ఆలోచించడం మంచిది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. వ్యాపారాల పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహా రాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఆర్థిక వ్యవ హారాలు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రయాణాలలో మంచి లాభాలు కలుగు తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. వ్యాపారాల్లో ఆశిం చిన పురోగతి ఉంటుంది. ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కొన్ని ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యల నుంచి అనుకోకుండా బయటపడతారు. ఆదాయానికి లోటుండదు. ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల కూడా లాభం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారం ప్రోత్సాహవంతంగా ముందుకు సాగుతుంది. ఉద్యోగంలో మీ సమర్థతకు తగిన గుర్తింపు లభి స్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగంలో మీ సమర్థత అనేక విధాలుగా బయటపడు తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక సమస్యలను ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆర్థక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సజావుగా పురోగమిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం దిశగా సాగుతుంది. అనుకున్న పనులు, వ్యవహారాలన్నీ సమయా నికి పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కొందరు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయం కొద్దిగానైనా పెరగడం తప్ప తగ్గడం ఉండదు. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కార మవుతాయి. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపో తుంది. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి రాబడికి అవకాశం ఉంది. రావలసిన సొమ్మంతా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. కుటుంబ ఖర్చులు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంటా బయటా మీ ప్రాభవం బాగా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా లాభాలు అందు కుంటారు. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెడతారు. ఉద్యో గంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.