Horoscope Today: వారికి వ్యక్తిగత, ఆర్థిక స‍మస్యలు పరిష్కారం.. 12రాశుల వారికి రాశిఫలాలు

3 hours ago 2

దిన ఫలాలు (జనవరి 23, 2025): మేష రాశి వారికి ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. వృషభ రాశి వారికి ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. హోదా పెరగడానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి సహకారం అందుతుంది కానీ, సహోద్యోగుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కుటుంబ జీవితంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. ఆస్తి వివాదాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అనుకోని రీతిలో ఆదాయం వృద్ది చెందు తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా పురో గతి చెందుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభి స్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం బాగా అనుకూలంగా ఉంటుంది. వృథా ఖర్చుల్నిబాగా తగ్గించుకుని, వ్యాపారాల్లోనూ, షేర్లలోనూ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతి లభించడానికి అవ కాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారా లను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఒక అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. అధికారులకు నమ్మకం ఏర్పడి ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. వ్యాపా రాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం కైడా సాను కూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్ది మార్పులు చేసి లాభాలు పొందుతారు. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగు తాయి. కొందరు మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగు లకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభి స్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. ఆర్థికపరంగా అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక స‍మస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. అనుకోకుండా అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అనుకోని ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయ త్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో మీ మీద అధికారులకు బాగా నమ్మకం పెరుగుతుంది. మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాలలో మీ ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. కొద్ది ప్రయ త్నంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఏ పని తలపెట్టినా తప్పకుండా విజయవంతంగా పూర్తవుతుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇత రులకు మేలు జరిగే పనులు చేస్తారు. కుటుంబపరంగా బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం నిలకడగా సాగిపోతుంది. ఉద్యోగపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. బంధుమిత్రులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొం టుంది. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో తప్పకుండా పురోగతి సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టవచ్చు. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article