తాజాగా మాదాపూర్ ప్రాంతంలో శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ దాడులు నిర్వహించి సిద్ధిక్ నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 830 గ్రాముల గంజాయితో పాటు 14 గ్రాముల హాష్ ఆయిల్ సీజ్ చేశారు. నిందితుల బైక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఐటీ కారిడార్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగులే లక్ష్యంగా ఈ గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు కేటుగాళ్లు. హాష్ ఆయిల్ అనేది ఒక రకమైన గంజాయి ఉత్పత్తి. ఇది సేంద్రీయ ద్రావకం. ఇది పారదర్శక బంగారు, లేత గోధుమరంగు, లేత గోధుమరంగు లేదా నలుపు రంగులో ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా ఉపశమనం కోసం గంజాయిని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, గంజాయి తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యపరంగా చాలా దెబ్బతింటాడు. ఆ కనీస ఆలోచన లేకుండా క్షణికమైన సుఖం కోసం యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గంజాయిని ఆశ్రయిస్తుండడం సరికాదు.. పైగా చట్టరీత్యా నేరం.
ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రామ్‌గూడలో ఉండే విద్యార్థులకు గంజాయిని అలవాటు చేస్తోంది ఈ గ్యాంగ్. అయితే.. తాజా ఘటనలో మాదాపూర్ సిద్దిఖీనగర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు గంజాయి విక్రయిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 830 గ్రాముల గంజాయితో పాటు 14 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దానితో పాటు వారికి చెందిన ఒక బైక్ కూడా సీజ్ చేశారు అధికారులు. అనంతరం NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..