రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదని అంటారు. ఇదే మాట గుడ్డుకు కూడా వర్తిస్తుంది. గుడ్డు ఆరోగ్యకరమైన శరీరాన్ని, మెరుస్తున్న జుట్టును ఇవ్వడమే కాకుండా మనసును సంతోషంగా ఉంచుతుంది. ఒక వ్యక్తి రోజూ గుడ్డు ఎందుకు తినాలో, అది మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
పోషకాలతో నిండిన శక్తి
గుడ్డు అనేక అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాల కలయికతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గుడ్డులో విటమిన్ D, విటమిన్ A, విటమిన్ B2, విటమిన్ B12, బయోటిన్, ఫోలేట్ వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంతో పాటు ఎముకలకు బలాన్ని అందిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడుతాయి.
అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్
గుడ్డులో ఉన్న ప్రోటీన్ మానవ శరీరంలోని కండరాలను బలపరుస్తుంది. గుడ్డులో అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. వీటి ప్రోటీన్ ద్రవ్యం చాలా సమర్థంగా జీర్ణమవుతుంది. అందుకే గుడ్డును ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న ఆహారంగా గుర్తించారు.
తృప్తికరమైన ఆహారం
గుడ్డు తినడం ద్వారా శరీర బరువును నియంత్రించుకోవచ్చు. అధిక ఆహారాన్ని తినకుండా నిరోధించడం వంటి ప్రయోజనాలను గుడ్డులు అందిస్తాయి. మధ్యాహ్నం లేదా రాత్రి ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
చర్మం, జుట్టు ఆరోగ్యం
చర్మం కోసం గుడ్డు తినడం మంచి అలవాటు. గుడ్డులో ఉండే లూటీన్, ప్రోటీన్ వంటి పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తాయి. అంతేకాకుండా, చర్మానికి తేమను అందించడంతో పాటు వయస్సు రాకుండా రక్షణగా ఉంటాయి. గుడ్డులో ఉండే ఫోలేట్, ప్రోటీన్, బయోటిన్, విటమిన్ A, విటమిన్ E జుట్టు ఆరోగ్యానికి దోహదపడుతాయి.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు
గుడ్డులో కోలిన్, ఒమేగా-3 అధికంగా ఉంటాయి. ఇవి మెదడు, గుండె, కంటికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. గర్భిణీ స్త్రీలకు గుడ్డు తినడం శిశువు మెదడు అభివృద్ధికి చాలా మంచిది. కోలిన్ రక్తపోటును నియంత్రించడంలో, లివర్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కంటి ఆరోగ్యం
గుడ్డులో లూటీన్, జియాక్సాంథిన్ వంటి పోషకాలు కంటి ఆరోగ్యానికి అవసరమైనవి. ఇవి వయస్సుతో కలిగే మాక్యులర్ డిజెనరేషన్ నుంచి కళ్ళను రక్షిస్తాయి. విటమిన్ A, సెలీనియం, ఒమేగా-3 వంటి పోషకాలు కంటి సంబంధిత సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)