డర్బన్‌లో సౌతాఫ్రీకాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 202 రన్స్ చేసింది. శాంసన్(107), తిలక్ వర్మ(33) పరుగులతో చెలరేగిపోయారు. వాస్తవానికి 15 ఓవర్లకే టీమిండియా కనీసం 250 ప్లేస్ రన్స్ చేస్తుందని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా సంజూ ఔటయ్యాక మిగితా ఆటగాళ్లు అంతగా రాణించలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లు కొయెట్జీ 3 వికెట్లు, జాన్సెన్, మహరాజ్, పీటర్, క్రూగర్ తలో వికెట్ తీశారు.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), ఐడెన్ మార్క్రామ్(c), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రుగర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్.