జనవరి 31తో ముగిసిన వారానికి భారతదేశ ఫారెక్స్ నిల్వలు 1.05 బిలియన్ డాలర్లు పెరిగి 630.607 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ ఇటీవల తెలిపింది. గత నివేదికలో మొత్తం నిల్వలు 5.574 బిలియన్ల డాలర్ల నుంచి పెరిగి 629.557 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. రూపాయిలో అస్థిరతలను తగ్గించడంలో ఆర్‌బీఐ కీలక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఫారెక్స్ మార్కెట్ జోక్యాలతో పాటు పునఃమూల్యాంకనం వంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆర్‌బీఐ చర్యల కారనంగా గత కొన్ని వారాలుగా వాల్యూ పరంగా తగ్గుతున్న నిల్వలు వరుసగా రెండవ వారంలో పెరిగాయి. 2024 సెప్టెంబర్ చివరి నాటికి ఫారెక్స్ నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికు చేరాయి. అంటే ఫారెక్స్ నిల్వలు 704.885 బిలియన్ల డాలర్లకు పెరిగాయి.
జనవరి 31తో ముగిసిన వారానికి నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 207 మిలియన్ డాలర్లు తగ్గి 537.684 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం వెల్లడైంది. డాలర్ పరంగా వ్యక్తీకరించిన విదేశీ కరెన్సీ ఆస్తులలో విదేశీ మారక నిల్వలలో ఉన్న యూరో, పౌండ్ మరియు యెన్ వంటి యూఎస్ యేతర యూనిట్ల పెరుగుదల లేదా తరుగుదల ప్రభావం ఉంటుంది. ఈ వారంలో బంగారం నిల్వలు 1.242 బిలియన్ డాలర్లు పెరిగి 70.893 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 29 మిలియన్ల డాలర్లు పెరిగి 17.889 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయని అపెక్స్ బ్యాంక్ తెలిపింది. ఈ బ్యాంక్ గత వారం తెలిపిన వివరాల ప్రకారం భారతదేశం యొక్క నిల్వ స్థానం 14 మిలియన్ల డాలర్లకు తగ్గి 4.141 బిలియన్ల డాలర్లకు చేరుకుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..