Youngest Cricketer In IPL Mega Auction: సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనున్న IPL 2025 వేలంలో అభిమానులు ఆశ్చర్యపరిచే ఓ ముఖం వేలంలో కనిపించనుంది. అందరి చూపు ఈ ఆటగాడిపైనే ఉంటుంది. అతని వయస్సు ఏమిటి, అతని విజయాలు, అసలు కెరీర్ ఎలా సాగుతోందో ఇప్పుడు తెలుసుకుందాం. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పాల్గొననున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ESPNCricinfo ప్రకారం ఈ బీహార్ యువ ఆటగాడు, జనవరి 5, 2024న ఫస్ట్ క్లాస్‌లో అరంగేట్రం చేశాడు. అక్కడ అతను తన 2 ఇన్నింగ్స్‌లలో 31 పరుగులు చేశాడు. దీంతో అతను బీహార్ తరపున రంజీ ట్రోఫీలో ఆడిన రెండవ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ అయ్యాడు. ఆధునిక యుగంలో అతి పిన్న వయస్కుడిగా, మొత్తం మీద నాల్గవ పిన్న వయస్కుడిగా మారాడు.
బీహార్ తరపున వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లలో (10 ఇన్నింగ్స్‌లు) 100 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 41 పరుగులు. ఇటీవలి U-19 టెస్ట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లలో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అక్కడ అతను 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇది భారతదేశ U19 ఆటగాడికి అత్యంత వేగవంతమైన సంచరీగా మారింది. మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు రనౌట్ అయ్యాడు.
అయినప్పటికీ, అతని వయస్సు గురించి కొన్ని వివాదాలు ఉన్నాయి. ఎందుకంటే అతను 2023లో BNN న్యూస్ బేనిపట్టికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను సెప్టెంబర్ 27, 2023 నాటికి 14 ఏళ్లు నిండాయని చెప్పాడు. ఇది అతని అధికారిక వయసు కంటే 1 సంవత్సరం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సూర్యవంశీకి రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతని లిస్ట్ సీరియల్ నంబర్ 491తో సెట్ 68లో కనిపించనున్నాడు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ వేలంలో ఎంత మంది ఆటగాళ్లు ఉన్నారు..
IPL సీజన్ 18 కోసం ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. నవంబర్ 24, 25 తేదీల్లో 574 మంది ఆటగాళ్లకు బిడ్డింగ్ జరగనుంది. ఇందులో మొత్తం 10 జట్లను పూర్తి చేయగల 200 నుంచి 250 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసే వీలుంది.
వేలంలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు ఎవరు?
IPL 2025 వేలానికి ఎంపికైన ఆటగాళ్లలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. వైభవ్‌కు 13 ఏళ్లు. అతను అమ్ముడైతే టోర్నమెంట్ చరిత్రలో ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా మారనున్నాడు.
వైభవ్ సూర్యవంశీ ఎవరు?
వైభవ్ సూర్యవంశీ 27 మార్చి 2011న బీహార్‌లోని సమస్తిపూర్‌కు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజ్‌పూర్ గ్రామంలో జన్మించాడు. అతను 9 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.
తండ్రి శిక్షణలో మెలుకువలు..
వైభవ్‌కి చిన్నతనం నుంచే క్రికెట్ ఆటపై ఆసక్తి పెరిగింది. దీనికి కుటుంబం కూడా పూర్తి మద్దతు ఇచ్చింది. అతని తండ్రి మొదటి కోచ్ అయ్యాడు. వైభవ్ తండ్రి తన కుమారుడికి క్రికెట్‌లో ప్రాథమిక పాఠాలు నేర్పించాడు.
ఇప్పటి వరకు కెరీర్ ఎలా ఉంది?
వైభవ్ 12 ఏళ్ల వయసులో వినూ మన్కడ్ ట్రోఫీలో బీహార్ అండర్-19 జట్టుకు ఆడాడు. అతను జనవరి 2024లో బీహార్ రంజీ జట్టులో చేరాడు. బీహార్ తరపున ఆడిన రెండవ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్, రంజీ ట్రోఫీ చరిత్రలో బీహార్ తరపున ఆడిన నాల్గవ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ అయ్యాడు. సెప్టెంబర్ 2024లో, అతను భారతదేశ అండర్-19 జట్టులో చేరాడు. ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు.
19 ఏళ్లలోపు అత్యంత వేగవంతమైన సెంచరీ..
తన తొలి అండర్-19 మ్యాచ్‌లోనే వైభవ్ 58 బంతుల్లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను 104 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. భారత అండర్-19 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..