IPL Auction 2025 Live Updates successful Telugu: మెగా వేలం మొదటి రోజు, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ముఖ్యాంశాల్లో నిలిచారు. మొత్తం 84 మంది ఆటగాళ్లను వేలం వేయగా, అందులో 12 మంది మాత్రమే మిగిలారు. వీరిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
Ipl Auction 2025 Live Updat
LIVE NEWS & UPDATES
-
25 Nov 2024 03:00 PM (IST)
IPL Auction 2025 Live Updates: మరో 132 ఖాళీలు
తొలిరోజు మొత్తం రూ.467.95 కోట్లు వెచ్చించి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. దీంతో మరో 132 స్లాట్‌లు పూరించాల్సి ఉంది. ఇందు కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు ఈరోజు బిడ్డింగ్‌లోకి రానున్నాయి.
IPL Auction 2025 Live Updates successful Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో నేడు రెండో రోజు. ఈరోజు అన్ని జట్లకు సంబంధించిన ప్లేయర్ల జాబితా బయటకు రానుంది. రెండు రోజుల పాటు జరిగిన వేలంలో తొలి రోజు భారత క్రికెటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఢిల్లీకి రిషబ్ కెప్టెన్‌గా ఉన్నాడు. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శ్రేయాస్ గతసారి ఛాంపియన్‌గా నిలిపాడు. ఇద్దరూ వేలానికి వెళ్లారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్రికెటర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. లక్నో అతన్ని రూ. 27 కోట్లకు తీసుకుంది. శ్రేయస్ ధర 26.75 కోట్లకు పెరిగింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్రాంచైజీ లీగ్‌లో ఆడేందుకు 1574 మంది క్రికెటర్లు నమోదు చేసుకున్నారు. తుది జాబితాలో 574 మందికి చోటు దక్కింది. చివరి నిమిషంలో ముగ్గురిని చేర్చారు. తొలిరోజు వేలానికి 84 మంది హాజరయ్యారు. అయితే, డేవిడ్ వార్నర్ అమ్ముడుపోకపోవడం గమనార్హం.
నేడు రెండవ రోజు కూడా మరిన్ని షాకింగ్ న్యూస్‌లు రావొచ్చు. ముఖ్యంగా ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ అండర్సన్ వైపు అందరి చూపు నెలకొంది. ఐపీఎల్‌లో తొలిసారిగా పేరు తెచ్చుకున్నాడు.
Published On - Nov 25,2024 2:57 PM