ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను జియో తన అధికారిక వెబ్‌సైట్ నుంచి పూర్తిగా తీసేసింది. గతంలో రూ. 189ల రీఛార్జి ప్లాన్‌లో కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభించేవి. అలాగే 2జీబీ డేటా కూడా ఈ ప్లాన్‌తో వచ్చేది. తక్కువ డేటా ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో రీఛార్జి ప్లాన్లు కావాలనుకునే వినియోగదారుల కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. దీంతో పాటు రూ.479 రీఛార్జి ప్లాన్ 84 రోజుల గడువుతో అందుబాటులో ఉండేది. దీని ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1000 ఎస్సెమ్మెస్‌లు, 6జీబీ డేటా లభించేవి. వాల్యూ ప్లాన్స్‌గా వీటిని పేర్కొనేవారు. ట్రాయ్ ఆదేశాలను అనుసరించి జియో వాయిస్ ఓన్లీ పేరిట రెండు రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువచ్చింది. రూ. 458, రూ. 1,958 ప్లాన్‌ను ప్రారంభించింది. రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. దీనిలో దేశీయంగా ఉచిత అపరిమిత కాలింగ్‌తో పాటు 1,000 ఉచిత ఎస్సెమ్మెస్‌లను పొందవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలయాల్లో QR కోడ్ సర్వే.. స్కాన్ చేస్తే సొల్యూషన్..
ఛాట్ జీపీటీ Vs డీప్‌సీక్.. ఇండియా పోటీ పడేదెప్పుడు