చలికాలంలో స్నానం చేయడానికి ఎక్కువమంది వేడి నీరు వాడతారు. దీనికోసం కొంతమంది వాటర్ హీటర్ యూజ్ చేస్తుంటారు. అయితే వాటిని వాడే క్రమంలో జాగ్తత్త అవసరం. చిన్న తొందర పాటు చర్య.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎలాంటి చిన్న జాగ్రత్త తీసుకున్నా ఆ ప్రాణం నిలిచేది. వివరాలు తెలుసుకుందాం....
Water Heater
N Narayana Rao | Edited By: Ram Naramaneni
Updated on: Feb 11, 2025 | 1:19 PM
వాటర్ హీటర్ ఓ మహిళ ప్రాణం తీసింది.. హీటర్ షాక్ కొట్టి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ప్రయాస, ఖర్చు ఉండవని నీళ్లు కాగపెట్టేందుకు చాలామంది హీటర్ వాడతారు. అయితే ఒక్కోసారి నిర్లక్ష్యం కారణంగా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. పరధ్యానంలో కొందరు కరెంట్ పాస్ అవుతుండగా… దాన్ని తాకడం లేదా నీళ్లలో చేతులు పెట్టడం వల్ల షాక్ కొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో విషాదం నెలకొంది.
వాటర్ హీటర్ పెట్టి.. ఆ నీళ్లలో చేయి పెట్టడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై పానెం సరస్వతి( 48 )అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సరస్వతి ఓ ప్రైవేటు కంపెనీ మెస్‌లో పనిచేస్తుంది. డ్యూటీకి వెళ్లేముందు స్నానం చేసేందుకు వాటర్ హీటర్ పెట్టింది. త్వరగా డ్యూటీకి వెళ్లాలనే కంగారులో నీళ్లు కాగాయో లేవో చూసేందుకు బకెట్లో చెయ్యి పెట్టింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సరస్వతి భర్త ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నెలల వ్యవధిలో భార్య,భర్త ఒకరితర్వాత ఒకరు చనిపోవటంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి