ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సిరోస్ ను కియా ఇండియా కంపెనీ ప్రజలకు పరిచయం చేసింది. మిడ్ మరియు కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మంట్ల మధ్య దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కారు ధర రూ.8.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ లు, లెవెల్ 2 అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. కియా సిరోస్ కారును రెండు రకాల ఇంజిన్ ఎంపికలతో అందుబాటులోకి తీసుకువచ్చారు. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ నుంచి 118 హెచ్ పీ, 172 ఎన్ ఎం గరిష్ట టార్కును విడుదల అవుతుంది. 1.5 డీజిల్ ఇంజిన్ 113 హెచ్ పీ , 113 ఎన్ ఎం శక్తి ని ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజిన్లూ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉన్నాయి. పెట్రోలు 7 స్పీడ్ డీసీటీ ఎంపికలో, డీజిల్ 6 స్పీడ్ టార్క్ కనర్వర్టర్ ఆటోమేటిక్ విధానంలో అందుబాటులో ఉంది.
కియా సోనెట్, సెల్టోస్ మధ్య విభాగంలో కొత్త సిరోస్ కారును తీసుకువచ్చారు. ధర విషయంలో కూడా ఆ రెండు కార్లకు మధ్యస్తంగా ఉంటుంది. సోనెట్ బేస్ ధర రూ.7.99 లక్షలు, సెల్టోస్ ధర రూ.11.12 లక్షలు కాగా, సిరోస్ కారు ప్రారంభ ధర రూ.8.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు కావడం విశేషం. సిరోస్ కారు ఐదు రకాల ట్రిమ్ లలో విడుదల అవుతుంది. వీటిలో హెచ్ టీకే రూ.8.99 లక్షలు, హెచ్ టీకే (ఓ) రూ.9.99 లక్షలు, హెచ్ టీకే ప్లస్ రూ.11.49 లక్షలు, హెచ్ టీఎక్స్ రూ.13.29 లక్షలు, హెచ్ టీఎక్స్ ప్లస్ రూ.15.99 లక్షలుగా నిర్ణయించారు.
కొత్త కారులో కియో కనెక్ట్ 2.0 సిస్టమ్, 80 కన్నా ఎక్కువ ఫీచర్లు, రియోట్ డయోగ్నోస్టిక్ సామర్థ్యాలు ఉన్నాయి. అలాగే 76.2 సీఎం ట్రినిటీ పరోరమిక్ డిస్ ప్లే, డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేడెట్ సీట్లు, భద్రత కోసం స్మార్ట్ క్రూయీజీ్ కంట్రోల్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్, 360 డిగ్రీ కెమెరా సిస్టమ్ తదితర వాటిని ఏర్పాటు చేశారు. మన దేశంలో ఎస్ యూవీ మార్కెట్ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా తయారు దారులు తమ పోర్టు పోలియోలను విస్తరించారు. కియా 2019 లో సెల్టోస్ ఎస్ యూవీతో భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ప్రీమియం సెగ్మెంట్ లో కీలకంగా మారింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి