మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో విశ్వక్ సేన్ లేడీ గెటప్పులో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. దీంతో లైలా సినిమా రన్‍టైమ్ వివరాలు బయటికి వచ్చాయి. ఈ చిత్రం 136 నిమిషాల (రెండు గంటల 16 నిమిషాలు)నిడివితో వస్తోంది. ఈ మధ్యన రిలీజవుతోన్న సినిమాల కంటే లైలా కాస్త తక్కువ రన్ టైమ్ తోనే రానుంది. రొమాంటిక్ కామెడీ మూవీ కావడంతో ఈ క్రిస్పీ రన్‍టైమ్ వర్కవుట్ అవుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.
కాగా సెన్సార్ బోర్డు లైలా మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే 18 సంవత్సరాల లోపు వారు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు అనుమతి ఉండదు. ఈ మూవీలో బోల్డ్ డైలాగ్‍లు, సీన్లు ఉండటంతో సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే యూత్‍కు కనెక్ట్ అయ్యేలా ఈ మూవీని తెరకెక్కించామని ఇటీవల ప్రమోషన్లలో చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్. లైలా సినిమాలో వెన్నెల కిషోర్, రవి మారియా, హర్ష వర్ధన్, నాగి నీడు, బ్రహ్మాజీ, పృథ్వీరాజ్, రఘుబాబు, వినీత్ కుమార్, అభిమాన్యు సింగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు.
ఇవి కూడా చదవండి
లైలా సినిమాలో విశ్వక్ సేన్..
Na cinemaki samandhinchina prathi poster na cinema ki samandhinchindhi matrame this was #sonumodel archetypal look poster released period agone . And the contiguous reddish suit photograph is besides from past . Spread emotion . Maintain bid . I can’t support reasoning doubly earlier each poster oregon station I… pic.twitter.com/WDNeeSi4xV
— VishwakSen (@VishwakSenActor) February 11, 2025
మోపిదేవి సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో విశ్వక్ సేన్..
Took blessings from Sri Subramanyeswara swamy temple ,Mopidevi. Filled with affirmative energy. Spread emotion not warfare ☮️ #Laila #LailaFromFeb14 pic.twitter.com/r8NCnJtZJv
— VishwakSen (@VishwakSenActor) February 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి