ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ వేడుకలో భాగమవుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా మహా కుంభమేళాకు తరలివస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ప్రముఖులు పెద్ద ఎత్తున మహా కుంభమేళాను దర్శించుకున్నారు. ఇప్పటికే సంయుక్త మేనన్, యాంకర్ లాస్య, బింధుమాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ, బిగ్ బాస్ ప్రియాంక జైన్ తదితర సినీ ప్రముఖులు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు. తాజాగా మరో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దిగంగన సూర్యవంశీ ఈ ఆధ్యాత్మిక వేడుకలో తళుక్కుమంది. తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్ రాజ్ వచ్చిన ఆమె పవిత్ర గంగానదిలో పుణ్య స్నానం ఆచరించింది. అనంతరం నాగ సాధువుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. తన మహా కుంభమేళా యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది దిగంగన. ‘జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది. హర హర మహాదేవ.. శంభో శంకర’ అంటూ తన ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చిందీ అందాల తార. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరలవుతున్నాయి.
దిగంగన సూర్య వంశీ విషయానికి వస్తే.. మొదట బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఫ్రైడే, జలేబి, రంగీలా రాజా తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక 2019లో కార్తికేయతో కలిసి హిప్పీ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత వలయం, సిటీమార్, క్రేజీ ఫెలో, శివం భజే సినిమాలతో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైంది.
ఇవి కూడా చదవండి
మహా కుంభమేళాలో దిగంగన సూర్య వంశీ..
ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది దిగంగన. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.