స్టార్ షూటర్, ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆమె కుటుంబ సభ్యులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలోని మహేంద్రగఢ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ వారిని ఢీకొట్టి పరారయ్యాడు.
Manu Bhaker
భారత స్టార్ షూటర్ మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మను భాకర్ మామ, అమ్మమ్మ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలోని మహేంద్రగఢ్‌లోని బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. మను భాకర్ మామ, అమ్మమ్మ ఇద్దరూ స్కూటీపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా కారు వారిని ఢీకొట్టింది. దీంతో వారు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన మరుక్షణమే కారు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.
ఇవి కూడా చదవండి
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..