రోహిత్ శర్మ హయాంలో ముంబై ఇండియన్స్‌కు గోల్డెన్ టైమ్ నడిచింది. అతని నాయకత్వంలో MI గతంలో ఐదు IPL ట్రోఫీలను గెలుచుకుంది. అయితే గత ఐపీఎల్‌కు ముందు రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ముంబై ప్రకటించింది. అయితే పాండ్యా నాయకత్వలో ముంబై దారుణ ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఏకంగా 10వ స్థానంలో నిలిచింది. అందుకే ఈసారి ముంబై మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. అందులో భాగంగానే సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన IPL మెగా వేలంలో ముంబై ఆచితూచి ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ ఏడాది మెగా వేలానికి ముందు 5 మంది క్రికెటర్లను తన వద్ద ఉంచుకుంది. 45 కోట్ల పర్స్ మనీతో ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు ముంబై మెగా వేలానికి వెళ్లింది. ముంబై ఇండియన్స్ RTM ఉపయోగించి ఒక క్రికెటర్‌ను తీసుకునే అవకాశం వచ్చింది. మెగా వేలానికి ముందు రోహిత్ జట్టులో మొత్తం 20 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అందులో 8 మంది విదేశీ క్రికెటర్లను ఎంపిక చేసుకునే అవకాశం లభించింది.
IPL మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఏ క్రికెటర్లను రిటైన్ చేసిందో ఒకసారి చూద్దాం రండి..
జస్ప్రీత్ బుమ్రా – 18 కోట్లు
సూర్యకుమార్ యాదవ్ – రూ. 16.35 కోట్లు
ఇవి కూడా చదవండి
హార్దిక్ పాండ్యా – 16.35 కోట్లు
రోహిత్ శర్మ – 16.30 కోట్లు
తిలక్ వర్మ – 8 కోట్లు
జెడ్డాలో జరిగిన IPL మెగా వేలం లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన క్రికెటర్ల జాబితా —
- ట్రెంట్ బౌల్ట్- 12.50 కోట్లు
- నమన్ ధీర్-5.25 కోట్లు
- రాబిన్ మిన్జ్-65 లక్షలు
- కరణ్ శర్మ- 50 లక్షలు
- దీపక్ చాహర్- 9.25 కోట్లు
- అల్లా ఘజన్ఫర్- 4.80 కోట్లు
- ర్యాన్ రికెల్టన్- కోటి
ముంబై వద్ద ఎంత పర్స్ మనీ ఉందంటే?
- ముంబై వద్ద ఉన్న పర్స్ మనీ : రూ. 11.05 కోట్లు.
- RTM కార్డ్‌లు: 0
- ప్లేయర్ స్లాట్స్: 12
- విదేశీ ప్లేయర్ల స్లాట్స్: 3
గమనిక: ఐపీఎల్ వేలం రెండో రోజు జరుగుతోంది. కాబట్టి, పూర్తి స్వ్కాడ్‌ను త్వరలోనే అప్ డేట్ చేసి అందిస్తాం..
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..