నేటి కాలంలో మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగంగా మారిపోయాయి. నిద్ర లేచాక చేసే మొదటి పని, నిద్రకు ముందు చివరి పని.. మొబైల్ చూడటమే. అయితే చాలా మంది ఉదయం నిద్రలేచాక నేరుగా బాత్రూంలోకి మొబైల్ ఫోన్లతోనే ప్రవేశిస్తుంటారు. కమోడ్ మీద కూర్చుని, మొబైల్ స్క్రీన్‌ను స్క్రోల్ చేస్తూ బిజీగా ఉంటారు. ఇలా చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
Updated on: Feb 08, 2025 | 6:29 PM
ఈ రోజుల్లో చాలా మంది నేరుగా బాత్రూంలోకి మొబైల్ ఫోన్లతోనే ప్రవేశిస్తున్నారు. కమోడ్ మీద కూర్చుని, మొబైల్ స్క్రీన్‌ను స్క్రోల్ చేస్తూ బిజీగా ఉంటారు. చాట్ లేదా వెబ్ సిరీస్ చూడటం వంటి పనులు చేస్తుంటారు.
1 / 5
కానీ ఈ అలవాటు క్రమంగా మిమ్మల్ని ప్రమాదం వైపు నెడుతుందని మీకు తెలుసా? బెంగళూరులోని CMI హాస్పిటల్‌లో పనిచేస్తున్న డాక్టర్ హేమ కృష్ణ మాట్లాడుతూ..మొబైల్ ఫోన్ పట్టుకుని ఎక్కువసేపు కమోడ్‌లో కూర్చుంటే.. అది మలవిసర్జన సమయాన్ని పొడిగిస్తుంది. ఇది శరీరానికి అస్సలు మంచిది కాదు.
2 / 5
అంతేకాకుండా బాత్రూంలో తరచూ మొబైల్ ఫోన్లు వాడేవారు మానసిక రుగ్మతలకు గురవుతారని నిపుణులు చెబుతున్నారు. నేటి కాలంలో జనాలు మొబైల్ ఫోన్‌లపై ఎంతగా ఆధారపడుతున్నారంటే, దాన్ని విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేని స్థితికి చేరుకుంటున్నారు.
3 / 5
బాత్రూమ్ బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశం. కాబట్టి మీరు మీ మొబైల్ ఫోన్‌ను బాత్రూంలో ఉపయోగిస్తే, మొబైల్ స్క్రీన్‌పై బ్యాక్టీరియా పేరుకు పోతుంది. ఈ బ్యాక్టీరియాను రోజంతా మీ ఫోన్ మోసుకెళ్తుంది. అదే ఫోన్ చేతిలో పట్టుకుని తిరుగుతాం. ఫలితంగా, ఈ బ్యాక్టీరియా చేతుల ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు వ్యాపిస్తుంది.
4 / 5
చాలా మంది బాత్రూమ్‌లో ఫోన్‌లో ఎంటర్టైన్మెంట్ రీల్స్ చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. బాత్రూంలో కూర్చున్నప్పుడు సాదారణంగా అందరూ రీల్స్ పైనే దృష్టి సారిస్తుంటారు. దీంతో మెడ వంచి నిరంతరం మొబైల్ ఫోన్ చూడటం వల్ల స్పాండిలైటిస్ ప్రమాదం పెరుగుతుంది. వెన్నునొప్పి, మెడ నొప్పి కూడా రావచ్చు.
5 / 5