టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ అయ్యింది హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. కొత్త బంగారం లోకం సినిమాతో తెరకు కథానాయికగా పరిచయమైన ఈ హీరోయిన్.. ఆ తర్వాత మాత్రం తన క్రేజ్ కాపాడుకోలేకపోయింది. ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుని సినిమాలకు దూరమయ్యింది. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరోయిన్.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. శ్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన బోల్డ్ వెబ్ సిరీస్ ఊప్స్.. అబ్ క్యా(Oops Ab Kya) అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ ట్రైలర్ శుక్రవారం విడుదల కాగా.. త్వరలోనే ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనిని దేబాత్మ మండల్ దర్శకత్వం వహించగా.. డైస్ మీడియా బ్యానర్ పై నిర్మించారు.
ఇందులో శ్వేతా, ఆశిమ్ గులాటి, జావెద్ జాఫ్రీ, సొనాలీ కులకర్ణి, అభయ్ మహాజన్, అపర మెహతా, అమీ కీలకపాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో తన బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ.. అనుహ్యంగా తన బాస్ వల్ల తల్లి కాబోయే పాత్రలో శ్వేతా నటించింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ట్రైలర్ విషయానికి వస్తే.. యూరినరీ ట్రాక్ట్ లో ఇన్ఫెక్షన్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లిన అమ్మాయికి..డాక్టర్ చేసిన పొరపాటుతో ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తర్వాత తన విషయంలో జరిగిన పొరపాటు గురించి తెలుసుకుంటుంది. ఈ క్రమంలోనే తన బాయ్ ఫ్రెండ్ తో మనస్పర్థలు వస్తాయి. ఈ నేపథ్యంలో అమ్మాయి జీవితంలో ఎలాంటి సంఘటనలు వచ్చాయనేది ఈ వెబ్ సిరీస్.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన