60 ప్లస్‌లో ఉన్నారు.. ఇంక వీళ్లేం చేస్తారు..? సీనియర్లు అయిపోయారు.. కుర్రాళ్లతో పోటీ పడతారా..? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు.. ఇంకా ఎనర్జీ ఉంటుందా..? ఇలాంటి అనుమానాలేం అక్కర్లేదమ్మా..! మన సీనియర్స్ దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు షేపులు మారిపోతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో రికార్డు జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. అవేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..?
Updated on: Feb 08, 2025 | 9:50 AM
టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత సీనియర్స్ సత్తా చూపిస్తున్నారు. నాగార్జున మాత్రమే ఇంకా పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇవ్వలేదు కానీ మిగిలిన ముగ్గురు మాత్రం ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుతున్నారు.
1 / 5
తాజాగా సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లకు పైగా వసూళ్లు చేసి సత్తా చూపించారు వెంకటేష్. సీనియర్లలో హైయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన రికార్డ్ వెంకీ పేరు మీదుందిప్పుడు. పాతికేళ్ల కింద కలిసుందాం రాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకటేష్.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లతో రీజినల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ కొట్టారు.
2 / 5
హైయ్యస్ట్ కలెక్షన్స్ వెంకీ పేరు మీదుంటే.. ఎక్కువ సార్లు 200 కోట్ల గ్రాస్.. 100 కోట్ల షేర్ అందుకున్న రికార్డ్ మరో సీనియర్ హీరో చిరంజీవి పేరు మీదుంది. రీ ఎంట్రీలో రప్ఫాడిస్తున్నారు మెగాస్టార్. ఖైదీ నెం 150తో 100 కోట్ల షేర్ అందుకున్న చిరు.. సైరా, వాల్తేరు వీరయ్య సినిమాలతో 200 కోట్ల గ్రాస్ అందుకున్నారు.
3 / 5
ఇక 100 కోట్ల గ్రాసర్స్ ఎక్కువగా మరో సీనియర్ హీరో బాలయ్య దగ్గరున్నాయి. ఈయన అఖండ తర్వాత విశ్వరూపం చూపిస్తున్నారు. అఖండతో మొదలైన సెంచరీలు.. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌తో కంటిన్యూ అయ్యాయి.
4 / 5
టాలీవుడ్‌కు పిల్లర్స్‌గా ఉన్న ఆ నలుగురులో ముగ్గురు సీనియర్లు ఒక్కొక్కరు ఒక్కో రికార్డు హోల్డ్ చేస్తున్నారు. కానీ ఈ లిస్టులో నాగార్జున ఒంటరిగా ఉన్నారు. ఈయన్ని కూడా తక్కువంచనా వేయడానికి లేదు. సరైన సినిమా పడితే కింగ్ కూడా రప్ఫాడిస్తారనడంలో సందేహం లేదు. ఆ మూవెంట్ కోసమే అక్కినేని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. అదే జరిగితే ఆ నలుగురు ఫామ్‌లోకి వచ్చినట్లే.
5 / 5