ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ శుభవార్త చెప్పాడు. తాను రెండోసారి తండ్రి గా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించాడు. అతని భార్య బెక్కీ కమ్మిన్స్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ సభ్యులు, ఇతర క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు కమిన్స్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పాట్ కమ్మిన్స్, అతని భార్య బెక్కీ కమ్మిన్స్ సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసి అభిమానులకు ఈ శుభవార్త అందించారు. కాగా కమ్మిన్స్ రెండోసారి తండ్రి అయిన తర్వాత క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో ప్రస్తుతం అతను గాయంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. పాట్ కమ్మిన్స్, బెక్కీ కమ్మిన్స్ తమ కొత్త అతిథి ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి ‘మా అందమైన పాప ఏడీ’ ఈ క్షణంలో మేము ఎంత సంతోషంగా, ప్రేమతో నిండి ఉన్నామో మాటల్లో చెప్పలేం’ అని ఆనందానికి అక్షర రూపమిచ్చారు కమిన్స్ దంపతులు. బెక్కీ కమ్మిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను కూడా షేర్ చేసింది, అందులో ఆమె, కమ్మిన్స్ సిడ్నీలోని బీచ్‌లో తమ బిడ్డతో నడుస్తున్నట్లు కనిపిస్తుంది.
పాట్ కమ్మిన్స్, బెక్కీ 2020 సంవత్సరంలో నిశ్చితార్థం చేసుకున్నారు. అంతకు ముందు చాలా కాలం పాటు డేటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత 2022 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. అయితే, ఈ జంట పెళ్లికి ముందే ఒక బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. అక్టోబర్ 2021లో, ఈ జంటకు ఆల్బీ అనే కుమారుడు జన్మించాడు.
ఇవి కూడా చదవండి
ప్యాట్ కమిన్స్ షేర్ చేసిన పోస్ట్..
పాట్ కమ్మిన్స్ ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు కానీ ఇప్పుడు గాయం తో తప్పుకున్నాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పుడు జట్టు సారథ్యాన్ని స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్‌కు అప్పగించవచ్చు. అంతేకాదు క్రికెట్ ఆస్ట్రేలియా త్వరలో కొత్త జట్టును ప్రకటించాల్సి ఉంటుంది, దీనికి చివరి తేదీ ఫిబ్రవరి 12.
ఫ్యామిలీతో కమిన్స్..
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..