ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు సాయంత్రం కేంద్రమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. ఇటీవలే పవన్ ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనితను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత పవన్ కేంద్రమంత్రితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది
Ap Deputy Cm Pawan Kalyan Going To Delhi
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పయనమయ్యారు. నేడు సాయంత్రం గం.7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటి కానున్నారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరఫున ప్రచారం చేయమని కేంద్రమంత్రి పవన్‌ను కోరనున్నట్లు తెలుస్తుంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలను పవన్ కేంద్రమంత్రికి వివరించనున్నట్లు సమాచారం. ఇటీవలే పవన్ ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనితపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అమిత్‌షాతో భేటి అనంతరం పవన్ విజయవాడకు తిరిగి రానున్నారు.