ప్రజలకు అవసరమైన కనీస అవసరాల్లో ఇల్లు ఒకటి. సురక్షితంగా జీవించడంతో పాటు సమాజంలో గుర్తింపునకు, చిరునామాకు ఇల్లు కీలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం విస్తరించిన నేపథ్యంలో అనేక ఇళ్లు, అపార్టుమెంట్లు అందుబాటులోకి వచ్చాయి. సంపన్నులు, ఎగువ మధ్యతరగతి ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. నిర్ణీత ఆదాయం ఉండడంతో సులభంగా ఈఎంఐలు చెల్లిస్తారు.
Pmay
సమాజంలో పేదల పరిస్థితి వారికి భిన్నంగా ఉంటుంది. సంపాదించిన కూలి డబ్బులు తిండికే సరిపోతాయి. ఇక ఇల్లు కట్టుకోవడం వారికి తీరని కలగా మారుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలాంటి వారికి అండగా నిలుస్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై-యూ) అర్బన్ పథకం కింద ఇళ్ల ను మంజూరు చేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకూ 88 లక్షలకు పైగా ఇళ్లను పేదలకు అందజేశారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి టఖాన్ సాహూ ఇటీవల రాజ్యసభలో ఇళ్ల విషయంపై వివరణ ఇచ్చారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులు ఇచ్చారు.
హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ ద్వారా ఈ ఏదాడి నవంబర్ 18 వరకూ 1.18 కోట్ల ఇళ్లను మంజూరు చేసినట్టు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిక ప్రాంతాలలో పేదలకు పక్కా ఇళ్లను అందించడానికి పీఎంఏవై-యూ కింద సాయం అందించామన్నారు. 2015 జూన్ 25 నుంచి నవంబర్ వరకూ ఈ ఇళ్లను మంజూరు చేశామన్నారు. అలాగే పీఎంఏవై-యూ అర్బన్ 2.0 పథకాన్ని ప్రారంభించినట్టు వెల్లడించారు. మంత్రి సాహూ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందించిన ప్రాజెక్టు ప్రతిపాదనల ఆధారంగా హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ ఈ ఏడాది నవంబర్ వరకూ 118.64 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో 88.02 ఇళ్ల ను లబ్దిదారులకు పంపిణీ చేశారు. మిగిలిన ఇళ్లు వివిధ దశలలో ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పది మిలియన్ల ఇళ్లను నిర్మించటానికి కేంద్రం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 1న పీఎంఏవై-యూ 2.0 (అందరికీ హౌసింగ్ ) అనే మిషన్ ను ప్రారంభించింది. ఈ పథకంలో నాలుగు రకాల పద్దతుల ద్వారా పేదలకు ఇళ్లను అందిస్తారు. బెనిఫిషయరీ లెడ్ కన్ స్ట్రక్షన్ (బీఎల్సీ) అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్టనర్ షిప్ (ఏహెచ్ పీ), సరసమైన అద్దె హౌసింగ్ (ఏఆర్ హెచ్), వడ్డీ రాయితీ పథకం (ఐఎస్ఎస్) విధానాలను అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో పీఎంఏవై-యూ 2.0 అమలుకు 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిక ప్రాంతాలు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానున్న ఐదేళ్లలో 2024-25 నుంచి 2028-29 వరకూ ఈ పథకం అమలవుతుంది. దేశంలోని దాదాపు కోటికి పైగా పేద కుటుంబాలకు గూడు కల్పించడం దీని ప్రధాన లక్ష్యం ఈ పథకాన్ని రూపొందించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి