సాధారణంగా ఇంట్లో టాయిలెట్ డోర్స్, పబ్లిక్ టాయిలెట్ తలుపులకు ఉండే తేడాను మీరు గమనించారా..ఇంట్లో టాయిలెట్స్ డోర్ పూర్తిగా ఉంటుంది. కానీ, పబ్లిక్ టాయిలెట్స్‌కి దిగువ నుండి కొద్దిగా గ్యాప్ ఉంటుంది. చాలా పబ్లిక్ టాయిలెట్లు ఇలాగే ఉంటాయి. బయటి నుంచి చూస్తున్న వాళ్లకి లోపలున్న వాళ్ల కాళ్లు కనిపిస్తున్నాయి. ఇలా ఏర్పాటు చేయటానికి ప్రత్యేక కారణాలు చాలా ఉన్నాయి. ఆ ఆసక్తికరమైన వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..
శుభ్రం చేయడానికి సులభంగా ఉంటుంది.
మాపింగ్- డోర్, ఫ్లోర్ మధ్య గ్యాప్ ఉన్నందున క్లీనర్లు తుడుపుకర్రతో ఫ్లోర్ మొత్తాన్ని సులభంగా శుభ్రం చేయటానికి వీలుంటుంది. ఇది క్లీనింగ్ పనిని సులభం చేస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ వేగంతో శుభ్రం చేసే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
పవర్‌వాష్- తలుపు నేల మధ్య అంతరం కారణంగా ఫ్లోర్ శుభ్రం చేయడం సులభం. పబ్లిక్ టాయిలెట్లను శుభ్రం చేయడానికి పవర్ వాషింగ్ అవసరం. ఇది శుభ్రపరచడం సులభం చేస్తుంది. టాయిలెట్ శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.
వెంటిలేషన్ అందించడానికి- వాసన తగ్గించడానికి వెంటిలేషన్ – తలుపు దిగువన ఉన్న గ్యాప్ గాలి వచ్చి, పోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది టాయిలెట్‌లోకి స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేస్తుంది. వాసనను తగ్గిస్తుంది. గాలి ఫ్రీగా ప్రసరించడం మూలానా చెడు వాసన బయటకు వెళ్తుంది. ఇది తడి లేకుండా ఎప్పటికప్పుడు ఎండిపోతుంది.
వాయువుల ఉద్గారం- టాయిలెట్లో అనేక రకాల వాయువులు ఉంటాయి. తలుపు దిగువన ఉన్న గ్యాప్ ఈ వాయువులను తప్పించుకోవడానికి వీలుగా ఉంటుంది. టాయిలెట్లో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది.
భద్రత కోసం ఎమర్జెన్సీ యాక్సెస్ – ఎవరైనా టాయిలెట్ లోపల మూర్ఛపోవడం లేదా తలుపు ఇరుక్కుపోవడం వంటి సమస్య తలెత్తినప్పుడు తలుపు కింద ఉన్న గ్యాప్ అత్యవసర యాక్సెస్‌గా పనిచేస్తుంది. ఇది ఇతర వ్యక్తులు లోపలికి వెళ్లి సహాయం చేయడానికి వీలుగా ఉంటుంది.
అవాంఛిత కార్యకలాపాలను నిరోధించడానికి – తలుపు క్రింద ఉన్న గ్యాప్ ద్వారా, లోపల ఎవరైనా ధూమపానం వంటి ఏదైనా అవాంఛిత కార్యకలాపాలు చేస్తున్నట్టయితే ఈజీగా గుర్తించవచ్చు.
శబ్దాన్ని తగ్గించడానికి- తలుపు దిగువన ఉన్న గ్యాప్ కూడా శబ్దాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
చౌక, సులభం- టాయిలెట్ దిగువన ఖాళీ స్థలంతో తలుపులు తయారు చేయడం, రవాణా చేయడం, కొనుగోలు చేయడం చాలా సులభం. కస్టమైజ్ చేయాల్సిన అవసరం ఉండదు.
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.