Venkatesh Iyer Ankle Injury: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ సహా పలువురు స్టార్ ప్లేయర్‌లు ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నారు. గురువారం నుంచి ప్రారంభమైన రంజీ ట్రోఫీ రెండో అంచెలో తమ సొంత జట్టు తరపున స్టార్ ప్లేయర్లు రంగంలోకి దిగారు. ఇదిలా ఉంటే, టోర్నమెంట్ నుంచి భారత ఆల్ రౌండర్ గురించి బ్యాడ్ న్యూస్ వచ్చింది. భారత ఆల్ రౌండర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చీలమండ గాయంతో మైదానం వీడాల్సి వచ్చింది. ఈ వార్త కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కూడా పెద్ద షాక్‌గా మారింది.
గురువారం జరిగిన రంజీ ట్రోఫీలో ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ గాయపడ్డాడు. కేరళతో మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్నప్పుడు, అతను తన కుడి చీలమండను మెలితిప్పాడు. ఆ తర్వాత నొప్పితో మూలుగుతూ కుప్పకూలాడు. వెంటనే మైదానంలో ఉన్న ఫిజియో అతనికి చికిత్స అందించారు. ఆ తర్వాత అతను మైదానం వదిలి వెళ్ళవలసి వచ్చింది.
గాయం కారణంగా మైదానం వీడిన అయ్యర్..
టాస్ గెలిచిన కేరళ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది, ఆ తర్వాత మధ్యప్రదేశ్ కష్టాల్లో పడింది. ఒకానొక సమయంలో మధ్యప్రదేశ్ కేవలం 49 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అయ్యర్ ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేయడానికి క్రీజులోకి వచ్చాడు. అతను చీలమండ గాయం కారణంగా డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి రావాల్సి వచ్చింది. అతను మూడు బంతుల్లో రెండు పరుగులు చేశాడు. అయ్యర్ గాయం కోల్‌కతాలో ఉద్రిక్తతను పెంచింది. వాస్తవానికి IPL 2025 మార్చి 21 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో కోల్‌కతా అతడిని రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో అయ్యర్ ఒకరు.
కుప్పకూలిన మధ్యప్రదేశ్ బ్యాటింగ్..
కేరళ ధాటికి మధ్యప్రదేశ్ బ్యాటింగ్ దెబ్బతింది. మధ్యప్రదేశ్ ఓపెనర్లు హర్ష్ గావ్లీని 7 పరుగుల వద్ద, హిమాన్షు మంత్రి 15 పరుగుల వద్ద ఎం నిధేష్ అవుట్ చేశాడు. ఆ తర్వాత రజత్ పాటిదార్‌ను ఖాతా తెరవడానికి కూడా అనుమతించలేదు. వీరితో పాటు ఆర్యన్ పాండే, కుమార్ కార్తికేయ సింగ్‌లు చౌకగా పెవిలియన్ చేరారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..