నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది యానిమల్, పుష్ప 2 చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూల్లు రాబట్టిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ అమ్మడు పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. తెలుగులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న రష్మిక.. అటు హిందీలోనూ నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం. అందులో ఛావా సినిమా ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఈ హిస్టారికల్ మూవీలో రష్మిక ప్రధాన పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ రోజు రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఛావా చిత్రంలో సంభాజీ మహారాజ్ భార్య మహారాణి యసుబాయ్ పాత్రను రష్మిక పోషిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అందులో పట్టుచీరకట్టులో ఒంటినిండా ఆభరణాలతో మహారాణి రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది రష్మిక. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతంగా ఉంది. మహారాణి యసుబాయ్ గా రష్మిక రెండు పోస్టర్స్ టీమ్ రివీల్ చేసింది. ఓ పోస్టర్ లో ఆమె చిరునవ్వుతో కనిపించగా.. మరో పోస్టర్ లో గంభీరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
మరాఠా యోధుడు మహారాజా సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్కీ కౌశల్, రష్మికతోపాటు . అక్షయ్ ఖన్నా, అషుతోశ్ రాణా, దివ్య దత్తా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించగా.. రేపు (జనవరి 22న) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..