తెలంగాణ సాయిధ పోరాటంలో అమరులైన యోధుల కథతో తెరకెక్కిన చిత్రం రజాకార్. అప్పటి రజాకర్ల దురాగతాలను అణచివేసి హైదరాబాద్‌ను ఇండియాలో విలీనం చేసేందుకు పటేల్ చేసిన ప్రయత్నాలను ఈ మూవీలో చూపించారు. గతేడాది మార్చి 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. అదే సమయంలో ఈ సినిమా ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. కొన్ని రాజకీయ పార్టీలు రజకార్ సినిమాకు అనుకూలంగా మాట్లాడితే మరికొన్నిపొలిటికల్ పార్టీలు ఈ మూవీపై మండిపడ్డాయి. ఇలా ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న రజకార్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన సుమారు 9 నెలల తర్వాత ఈ కాంట్రవర్సీ మూవీ ఓటీటీలోకి రావడం విశేషం. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో రజాకార్ సినిమాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కురిపించారు. అందరూ తప్పకుండా ఈ సినిమాను చూడాలని కోరారు.
ఇవి కూడా చదవండి
‘కాలం దాచిన తెలంగాణ విముక్తి పోరాటాన్ని, మన తెలంగాణ పోరాట యోధుల చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కించిన సినిమా ఇది.రజాకార్ల దురాగతాలను ఎదురించడానికి ప్రజలే సాయుధులై కదన రంగం లో దిగిన యదార్థ కథ ఇది. చరిత్ర పుటల్లో దాగిన ఈ నెత్తురు జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపిన సినిమా రజాకార్. నిజాం హయాంలో జరిగిన మారణహోమాన్ని, హిందువులపై జరిగిన దౌర్జన్యాలను, బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు ప్రజలే సాయుధులై ఎలా పోరాటం చేశారో ఈ రజాకార్ సినిమాలో చూపించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఆర్థిక నష్టాలు ఎదురైనా భయపడకుండా గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మించిన గొప్ప సినిమా రజాకార్ సినిమా శుక్రవారం ( జనవరి 24 ) నుంచి OTT వేదికగా ఆహా యాప్ లో ప్రసారమవుతోంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరుతున్నా. ముఖ్యంగా ప్రతీ హిందువు తప్పకుండా ఈ మూవీ చూడాలని కోరుతున్నా’ అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
రజాకార్ సినిమా గురించి బండి సంజయ్ మాటల్లో.. వీడియో
కాలాం దాచిన తెలంగాణ విముక్తి పోరాటాన్ని #Aha లో చూడండి, మన తెలంగాణ పోరాట యోధుల చరిత్రను తెలుసుకోండి.
Premiering January 24th, exclusively connected Aha!
Watch #Razakar lone connected ahaGold▶️https://t.co/ZyP1iSy5XA #Razakar @bandisanjay_bjp @anusuyakhasba @actorsimha @actorjohnvijay… pic.twitter.com/Ew06JYSGLd
— ahavideoin (@ahavideoIN) January 23, 2025
ఆహాలో స్ట్రీమింగ్..
రజాకార్ల దురాగతాలను ఎదురించడానికి ప్రజలే సాయుధులై కదన రంగం లో దిగిన కథ , చరిత్ర పుటల్లో దాగిన ఈ నెత్తురు కథని #Aha లో చూడండి .
Watch #Razakar lone connected aha ▶️https://t.co/5isXExre1a @anusuyakhasba @actorsimha @actorjohnvijay @therajarj @Vedhika4u #Hyderabad pic.twitter.com/g05ZHbh0Kg
— ahavideoin (@ahavideoIN) January 23, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.