మెగా హీరో సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్న ఈ హీరో తాజాగా బుధవారం ఆళ్లగడ్డలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
J Y Nagi Reddy | Edited By: Rajitha Chanti
Updated on: Feb 12, 2025 | 5:21 PM
నటుడు సాయిధరమ్ తేజ్ చిరంజీవి గురించి ఎలాంటి కామెంట్స్ చేశారు? రాజకీయాల్లోకి ఎంట్రీ పై సాయి ధరం ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? చిరంజీవితో కలిసి ఎప్పుడు నటించబోతున్నారు? సంబరాల ఏటిగట్టు సినిమా గురించి సాయిధరమ్ తేజ్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలుసా?
ఆళ్లగడ్డ మండలం అహోబిలం లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని సినీ హీరో సాయి ధరమ్ (దుర్గ) తేజ్ దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహ స్వామికి సాయి దుర్గ తేజ్ తో ప్రత్యేక పూజలు ఆలయ వేద పండితులు నిర్వహించారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు ఆర్చకులు సాయి ధరం తేజ్ కి అందజేశారు. అనంతరం సాయి ధరం తేజ్ మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను నటించబోయే సంబరాల ఏటిగట్టు సినిమా అప్డేట్స్ చెప్పుకొచ్చారు. యువత బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. తన పెద్ద మామయ్య మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు. రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ తనకు రాజకీయాలతో పనిలేదని ప్రస్తుతానికి ఈ పూటకు భోజనం చేస్తే చాలు అనుకుంటానని, మాట్లాడినంత ఈజీ కాదు రాజకీయం చేయడం అని అన్నారు. తనకు దగ్గరుండి చూసుకున్న డిపార్ట్మెంట్ కు ఆలయ సిబ్బందికి స్వాగతించిన మెగా అభిమానులకు జనసేన నాయకులకు మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 250 కోట్ల విలువైన ఇల్లు.. 3 కోట్ల కారు.. ఈ హీరోయిన్ ఆస్తులు ఆమె భర్త కంటే ఎక్కువే..