గ్లామర్ ఫోజులకు దూరంగా ఉంటూ న్యాచురల్ లుక్స్, సహజ నటనతో మెప్పించిన హీరోయిన్ సాయి పల్లవి. అందుకే ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సాయి పల్లవి నటించిన చిత్రాల కోసం సౌత్ అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. ఎలాంటి పాత్రలలోనైన జీవించేస్తుంది. సాయి పల్లవి తన సింప్లిసిటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మేకప్ లేకుండా సాధారణ అమ్మాయిల కనిపిస్తూ వెండితెరపై మాయ చేస్తుంది. సహజ నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా తండేల్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8న ఈసినిమాను రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది.
తండేల్ చిత్రంలో రాజు, సత్య పాత్రలలో నాగచైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ చూసి ఫిదా అవుతున్నారు సినీప్రియులు. ఇదిలా ఉంటే.. సాయి పల్లవి భవిష్యత్తులో దర్శకత్వం పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తండేల్ సినిమా ప్రమోషన్లలలో సాయి పల్లవి, చైతూ ఇద్దరు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. అలాగే అడియన్స్ అడిగిన ప్రశ్నలపై సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే సాయి పల్లవిని ఉద్దేశిస్తూ.. “మీరు ఎప్పుడైనా సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందా ? ” అని అడగ్గా.. వెంటనే లేదు అంటూ ఆన్సర్ ఇచ్చించి సాయి పల్లవి. దీంతో వెంటనే నాగచైతన్య రియాక్ట్ అయ్యారు.
గతంలో సాయి పల్లవి తనకు ఓ విషయం చెప్పిందని. ఆమె ఒక సినిమాకు దర్శకత్వం వహించాలనుకుంటున్నానని.. అందులో ఓ పాత్రకు నన్ను ఎంపిక చేసుకుంటుందని చెప్పింది అంటూ చైతన్య అసలు విషయం చెప్పేశాడు. నాకు అది గుర్తుంది అంటూ నవ్వేసింది సాయి పల్లవి. ఈ వార్త విన్న తర్వాత అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. సాయి పల్లవి ప్రస్తుతం ‘రామాయణం’ సినిమా పనిలో బిజీగా ఉంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా కనిపిస్తాడు.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన