బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి శ్వేతా రోహిరా రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందున్న ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది శ్వేత. ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోస్ షేర్ చేస్తూ లైఫ్ ఫుల్ సర్ ప్రైజస్ కదా.. ఈరోజు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను.. కానీ జీవితం నిర్ణయించే ప్లాన్స్ వేరు.. సడన్ గా ఓ బైక్ వచ్చి మీకు తగిలి మిమ్మల్ని రెస్టింగ్ మూడ్ లోకి పంపుతుంది. కొన్నిసార్లు జీవితం పూర్తిగా కదిలిస్తుంది. ఎందుకంటే జీవితం మనల్ని మరింత బలంగా మారుస్తుంది. అంతేందుకు విధ్వంసమే సృష్టికి విశాలమైన మార్గం అంటూ రాసుకొచ్చింది. ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ చూస్తుంటే ప్రమాదంలో శ్వేత తీవ్రంగానే గాయపడినట్లు తెలుస్తోంది. ఆమె కాలుతోపాటు ముఖానికి సైతం ఎక్కువగా గాయాలు అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో వైరలవుతున్న శ్వేత ఫోటోస్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్.
శ్వేత త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్వేత సల్మాన్ ఖాన్ కు రాఖి కట్టిన సోదరి. శ్వేత 2014లో నటుడు పుల్కిత్ సామ్రాట్‌ని పెళ్లాడింది. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వివాహమైన ఒక సంవత్సరం తర్వాత, శ్వేత, పుల్కిత్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. శ్వేత నుండి విడాకులు తీసుకున్న తరువాత, పుల్కిత్ రెండవ జీవితాన్ని ప్రారంభించాడు.
ఇవి కూడా చదవండి
గతేడాది పుల్కిత్ హీరోయిన్ కృతి కర్బందను వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ శ్వేత మాత్రం ఇంకా సింగిల్‌గానే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు శ్వేత రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన