Samantha: అతడి దృష్టిలో సమంత ఎప్పుడూ సూపర్ స్టారే.. వరుణ్ ధావన్ ఆసక్తికర కామెంట్స్..

2 hours ago 1

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ సిటాడెల్ : హనీ బన్ని. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కానీ ఇప్పుడు నవంబర్ 7న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటుంది సామ్. ఆమెతోపాటు హీరో వరుణ్ ధావన్, వెబ్ సిరీస్ టీం కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ ధావన్.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కూడా సమంత పనికి అభిమానే అని అన్నారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. “సమంతను అట్లీ ఎన్నోసార్లు ప్రశంసించారు. ఆమెను ఫిల్మ్ స్టార్ అని అంటారు. మేము సమంత గురించి ఎప్పుడు మాట్లాడుకున్నప్పటికీ అట్లీ ఆమెను సూపర్ స్టార్ అనే పిలుస్తారు. తన పనికి అట్లీ అభిమాని. సమంత అద్భుతమైన నటి. చాలా ప్రొఫెషనల్. ఆమెతో కలిసి నటించిన కొన్ని సన్నివేశాలు చాలా సరదాగా అనిపించాయి. సినిమాపై మా ఇద్దరికి ఉన్న అభిరుచి వల్ల మేం త్వరగానే కనెక్ట్ అయ్యాం. మేమిద్దరం ఎప్పుడూ కొత్తం ఏదైనా చేయాలనే ఆలోచనలోనే ఉంటాం” అని అన్నారు.

చివరగా ఖుషి చిత్రంలో కనిపించిన సామ్.. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ అప్పటికే అంగీకరించిన ఈ సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేసింది. ఓవైప మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటూనే మరోవైపు సిటాడెల్ చిత్రీకరణలో పాల్గొంది సామ్. కానీ తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ సిరీస్ ఆఫర్ రిజెక్ట్ చేయాలని అనుకున్నానని గతంలోనే చెప్పుకొచ్చారు సామ్. ఈ సిరీస్ స్క్రిప్ట్ చూసిన తర్వాత తాను ఇందులో చేయగలనా అని ఆలోచించానని..ఇందులో నటించానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు.

ఒక్కోరోజు ఆరోగ్యం సహకరించకపోయినా ఉదయం నాలుగు గంటలకే షూటింగ్ లో పాల్గొనేదాన్ని అని.. అప్పటి నుంచి మధ్యాహ్నం వరకు షూట్ చేయగలవా అని రాజ్ ఎన్నో సార్లు అడిగారని గుర్తుచేసుకుంది. అయినా ఈ సిరీస్ పూర్తిచేశానంటే చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు సామ్.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article